Mohammed Azaharuddin : ప్రపంచ క్రికెట్ చరిత్రలో మహమ్మద్ అజహరుద్దీన్ ఓ సంచలనం. భారత క్రికెట్ జట్టుకు ఎనలేని విజయాలు అందించిన ఘనత ఆయనది. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ గా ఉన్నారు.
మాజీ ఎంపీ కూడా. ఇప్పటికీ కూడా అజ్జూ భాయ్ సృష్టించిన చరిత్రను ఎవరూ చేరుకోలేక పోయారు. వరుసగా మూడు టెస్టుల్లో సెంచరీలు సాధించిన అరుదైన ఆటగాడు మహమ్మద్ అజహరుద్దీన్(Mohammed Azaharuddin ).
ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. క్రికెట్ ఆట పట్ల ఆయనకు అద్భుతమైన అవగాహన ఉంది. అజ్జూ భాయ్ సూచనలతో చాలా మంది ఆటగాళ్లకు సూచనలు, సలహాలు ఇస్తుంటారు.
ఆయన అడ్వైజ్ తో పలువురు అద్భుతంగా ఆడారు. ఇంకా ఆడుతూనే ఉన్నారు. ఆయన సారథ్యంలో ఎందరో ఆటగాళ్లను సపోర్ట్ చేశారు. వారిలో ప్రస్తుతం బీసీసీఐ చీఫ్ గా ఉన్న గంగూలీ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.
ఇక చెప్పుకుంటూ ఎనలేని చరిత్ర ఉంది. తాజాగా అజహరుద్దీన్ ట్విట్టర్ వేదికగా అరుదైన ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తోంది.
1992 వరల్డ్ కప్ సందర్భంగా సిడ్నీ హార్బర్ లో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. అజహరుద్దీన్ ఈ ఫోటోల కింద ఓ క్యాప్షన్ రాశాడు.
ఈ ఫోటోలో లేని క్రికెట్ దిగ్గజం ఎవరో తెలుసా అని నిలదీశాడు. అజ్జూ భాయ్ వేసిన ప్రశ్నకు పెద్ద ఎత్తున స్పందించారు క్రికెట్ అభిమానులు. నెటిజన్లు.
అతడు ఎవరో కాదు 1983 లో భారత్ కు ప్రపంచ కప్ తీసుకు వచ్చిన దిగ్గజం కపిల్ దేవ్ అంటూ పేర్కొన్నారు.
Also Read : లంకేయులతో భారత్ యుద్దానికి సిద్దం