Akhilesh Yadav: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఆహ్వానంపై అఖిలేశ్ అసహనం !

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఆహ్వానంపై అఖిలేశ్ అసహనం !

Akhilesh Yadav: యావత్ ప్రపంచం ఆశక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపధ్యంలో దేశంలోని వివిధ రాజకీయ, సినీ, వ్యాపార, ఆధ్యాత్మిక ప్రముఖులకు ఇప్పటికే ాలయ వర్గాలు ఆహ్వానాలు అందజేస్తున్నాయి. అయితే ఈ రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించి తనకు ఆహ్వానం అందలేదని సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav) శుక్రవారం తెలిపారు. కొరియర్‌ రూపంలోనూ ఆహ్వాన పత్రిక తనకు పంపలేదన్నారు. ఒకవేళ అదే నిజమైతే… సంబంధిత ఆలయ వర్గాలు ఆధారాలు చూపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Akhilesh Yadav Comment

మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ శుక్రవారం తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ‘‘ఆలయ సంబంధిత వర్గాలు నన్ను అవమానిస్తున్నాయి. నాకు ఇంతవరకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. మనమేదైనా కార్యక్రమం నిర్వహించినప్పుడు తెలిసిన వారిని మాత్రమే పిలుస్తాం. అపరిచితులను ఆహ్వానించం’’ అని అన్నారు. కొరియర్‌ ద్వారా ఆహ్వాన పత్రాన్ని పంపినట్లు తెలిసిందని ఓ మీడియా ప్రతినిధి పేర్కొనగా… సరైన చిరునామాకు పంపారో ? లేదో ? తెలుసుకునేందుకు పంపించిన రశీదును తనకు చూపించాలని డిమాండ్ చేసారు.

అయితే అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్‌ స్పందించారు. ‘‘అఖిలేశ్‌ యాదవ్‌కు ఆహ్వానం అందిందో… లేదో… నేను ధ్రువీకరించలేను. కానీ ఆహ్వానితుల జాబితాలో అఖిలేశ్ పేరు ఉంది’’ అని తెలిపారు. అయోధ్యలో ఈ నెల 22న జరిగే శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకకు దూరంగా ఉండాలని ఇప్పటికే కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌రంజన్‌ చౌధరిలు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.

Also Read : PM Modi Call : దేశంలోని ఆలయ పెద్దలకు ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

Leave A Reply

Your Email Id will not be published!