Akhilesh Yadav : సమాజ్ వాది పార్టీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు ఒక్కటైన బాబాయ్ శివపాల్ యాదవ్ (Shivpal Yadav) అబ్బాయి అఖిలేష్ యాదవ్ లు (Akhilesh Yadav) ఫలితాలు వెలువడిన అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి.
ఈ మేరకు తన బాబాయ్ కి దగ్గరైన వర్గీయులపై వేటు వేశారు. దీంతో సీరియస్ అయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఘాజీ పూర్ నియోజకవర్గంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగా పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పని చేసిన వారిపై సీరియస్ అయ్యారు.
ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే కైలాష్ సింగ్ తో పాటు ఘాజీ పూర్ జిల్లా మాజీ పంచాయతీ చీఫ్ విజయ్ యాదవ్ పలువురిని బహిష్కరించారు. ప్రస్తుతం తాజాగా జరిగిన ఎన్నికల్లో 403 సీట్లకు గాను బీజేపీ (BJP) మిత్రపక్ష కూటమి 273 సీట్లు గెలుపొందింది.
యోగి ఆదిత్యా నాథ్ రెండో సారి సీఎంగా కొలువు తీరారు. ఇదే సమయంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) మిత్రపక్షాలతో సమావేశం అయ్యారు.
వీరిలో అప్నా దళ్ – కె, సుహెల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ – ఎస్బీఎస్పీ , రాష్ట్రీయ లోక్ దళ్ నాయకులతో ప్రత్యేకంగా చర్చంచారు. ఈ కీలక మీటింగ్ కు పీఎస్పీ చీఫ్ శివలాల్ యాదవ్ హాజరు కాలేదు.
ఆయనతో పాటు అప్నా దళ్ – కె నాయకురాలు పల్లవి పటేల్ హాజరు కాలేదు. ప్రధాన సమస్యలపై చర్చించామని, తనకు బాబాయ్ శివపాల్ యాదవ్ (Shivpal Yadav) కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) .
Also Read : సరిహద్దు వివాదం చారిత్రాత్మక ఒప్పందం