Akhilesh Yadav : రైతుల పంతం బీజేపీ అంతం

ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్

Akhilesh Yadav  : యూపీలో రైతులు త‌మ వైపు ఉన్నార‌ని భారతీయ జ‌న‌తా పార్టీని ఓడించ‌డం ఖాయ‌మ‌ని జోస్యం చెప్పారు స‌మాజ్ వాది పార్టీ చీఫ్‌, మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్.

ఇవాళ దేశం యావ‌త్తు యూపీ లోని క‌ర్హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం వైపు చూస్తోంది. ఎందుకంటే ఇక్కడ మొద‌టి సారిగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అఖిలేష్ యాద‌వ్(Akhilesh Yadav )ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.

రాజ‌కీయంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎమ్మెల్సీగా, ఎంపీగా ఉన్నారు. మొద‌టి సారిగా బ‌రిలో ఉన్నారు. ఇప్ప‌టికే రైతుల‌ను న‌ట్టేట ముంచిన చ‌రిత్ర బీజేపిద‌ని ఆరోపించారు. ఇవాళ 59 నియోజ‌క‌వ‌ర్గంలో మూడో విడ‌త పోలింగ్ కొన‌సాగుతోంది.

ఈ సంద‌ర్భంగా అఖిలేష్ యాద‌వ్(Akhilesh Yadav )త‌న భార్య డింపుల్ యాద‌వ్ తో క‌లిసి జ‌స్వంత్ నగ‌ర్ లోని సైఫై గ్రామంలోని బూత్ నంబ‌ర్ 239 లో ఓటు వేశారు. అక్క‌డ శివ పాల్ యాద‌వ్ ను పోటీలో నిలిపింది.

ఓటు వేసిన అనంత‌రం అఖిలేష్ యాద‌వ్ మీడియాతో మాట్లాడారు. ఈసారి ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అత్య‌ధిక సీట్లు గెల‌వ‌డం ఖాయ‌మ‌న్నారు.

తాము ప‌వ‌ర్ లోకి వ‌స్తామ‌న్నారు. యోగి క‌న్న క‌ల‌లు, బీజేపీ ఆశ‌లు ఆవిరి అవుతాయ‌ని చెప్పారు అఖిలేష్ యాద‌వ్. ప్ర‌జ‌లు రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నార‌ని అన్నారు.

కొద్ది రోజుల్లో యోగి రాష్ట్రంలో ఉండ‌ర‌న్నారు. రైతులు, పేద‌లు, మైనార్టీలు, బాధితులు, బ‌హుజ‌నులు పెద్ద ఎత్తున బీజేపీకి వ్య‌తిరేకంగా ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు.

త‌మ విజ‌యాన్ని ఏ శ‌క్తి అడ్డుకోలేద‌న్నారు. రాచ‌రిక పాల‌న‌కు ముగింపు ప‌ల‌కాల్సిన అవ‌స‌రం ఆస‌న్న‌మైద‌ని పేర్కొన్నారు అఖిలేష్ యాద‌వ్.

Also Read : దిగ్విజ‌య్ సింగ్ కామెంట్స్ క‌ల‌క‌లం

Leave A Reply

Your Email Id will not be published!