Akhilesh Yadav : సమాజ్ వాది పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. యూపీలో మూడో విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది.
అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, సమాజ్ వాది పార్టీ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఓ వైపు ప్రధాని మోదీ, అమిత్ షా, యోగి ఇంకో వైపు అఖిలేష్ యాదవ్ , ప్రియాంక గాంధీ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో మాటల తూటాలు పేల్చుతున్నారు.
ఉగ్రవాదులకు ఎస్పీ మద్దతు ఇస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు ప్రధాని మోదీ. తాను వచ్చాకే నేరస్థుల ఆట కట్టించానంటూ ప్రచారం హోరెత్తిస్తున్నారు యోగి ఆదిత్యానాథ్.
గతంలో పాలకులు తమ ఆస్థులు పెంచు కోవడానికి ప్రయారిటీ ఇచ్చారని కానీ తాము వచ్చాక ప్రజలకు పాలన అందిస్తున్నామని అంటున్నారు.
రైతులను పొట్టన పెట్టుకోవడమే కాక, వారిని చంపిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా వ్యవహారం ఇప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.
రైతు సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్ బెయిల్ ఇవ్వడాన్ని తప్పు పట్టారు. ఇది ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం తప్ప మరొకటి కాదన్నారు.
ఈ తరుణంలో అఖిలేష్ యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారంటూ ఆయనపై కేసు దాఖలు చేశారు.
ఈ తరుణంలో అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) సీరియస్ అయ్యారు యోగిపై. ఆయన పాలన పూర్తిగా రాచరికాన్ని తలపిస్తోందంటూ ధ్వజమెత్తారు. ఎన్ని కేసులు నమోదు చేసినా తనను ఏమీ చేయలేరంటున్నారు.
Also Read : అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు