Akhilesh Yadav : మామ శివ‌పాల్ కాళ్లు మొక్కిన అఖిలేష్

మెయిన్ పురిలో డింపుల్ యాద‌వ్

Akhilesh Yadav : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స‌మాజ్ వాది పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ సీఎం ములాయం సింగ్ యాద‌వ్ ఇటీవ‌లే మృతి చెందారు. ఆయ‌న కంటిన్యూగా గెలుస్తూ వ‌చ్చిన మెయిన్ పురి నియోజ‌క‌వ‌ర్గానికి ఖాళీ ఏర్ప‌డింది. దీంతో ఎన్నికల సంఘం నోటిఫికేష‌న్ జారీ చేసింది.

ఇక్క‌డ ములాయం సింగ్ యాద‌వ్ కోడ‌లు, మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్(Akhilesh Yadav) భార్య డింపుల్ యాద‌వ్ బ‌రిలో నిలిచింది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో మామ శివ పాల్ యాద‌వ్ అల్లుడు అఖిలేష్ మ‌ధ్య అభిప్రాయ భేదాలు పొడ‌సూపిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. తామిద్ద‌రి మ‌ధ్య అవేవీ లేవంటూ తాజాగా త‌న భార్య డింపుల్ యాద‌వ్ తో క‌లిసి శివ పాల్ యాద‌వ్ నివాసానికి వెళ్లారు.

త‌న భార్య‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. కాగా మెయిన్ పురిలో గెల‌వాలంటే తప్ప‌నిస‌రిగా శివ‌పాల్ యాద‌వ్ మ‌ద్ద‌తు ఉండాల్సిందే. అంత‌లా ప‌ట్టుంది ఆయ‌న‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గం మీద‌. అందుకే ప‌దే ప‌దే త‌న మామ‌ను క‌లుస్తూ వ‌చ్చారు అఖిలేష్ యాద‌వ్. ఇక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆదివారం ఊహించ‌ని సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌రిగిన ర్యాలీలో త‌న మామ శివ‌పాల్ యాద‌వ్ పాదాల‌ను తాకారు అఖిలేష్ యాద‌వ్. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాం గోపాల్ యాద‌వ్ తో క‌లిసి వేదిక పంచుకున్నారు. తమ మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని చాటి చెప్పారు అఖిలేష్ యాద‌వ్.

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట్లో వైర‌ల్ గా మారింది.

Also Read : మంచిది మ‌తం మ‌నుషులు ప్ర‌మాదం

Leave A Reply

Your Email Id will not be published!