Akshata Murthy : అక్ష‌త మూర్తి పంట పండింది

భారీగా అందుకున్న డివిడెండ్

Akshata Murthy : తెలుగు వారంద‌రికీ సుప‌రిచితం ఎప్పుడూ వ‌చ్చే యాడ్ అదే డ‌బ్బులు ఊరికే రావు అని. కానీ ఒక్కోసారి ముంద‌స్తు ఆలోచ‌న డ‌బ్బులు ఊరికే వ‌చ్చేలా చేస్తాయి. దానికి కూడా ఓ ప్లాన్ ఉండాలి. ప్ర‌ధానంగా కంపెనీకి సంబంధించి పాజిటివ్ టాక్ ఉంటేనే స‌రి పోదు..స్టాక్ మార్కెట్ లో కూడా షేర్స్ పెరిగితే అందులో పెట్టుబ‌డి పెట్టిన వాళ్ల‌కు కూడా పంట పండిన‌ట్లే.

మ‌రి కొత్త‌గా ఈ అక్ష‌త మూర్తి ఎవ‌ర‌ని అనుకుంటున్నారా. ప్ర‌స్తుతం భార‌తీయ సంత‌తికి చెందిన బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రి రిషి సున‌క్ గారాల ముద్దుల ప‌ట్టి..భార్య అక్ష‌త మూర్తి(Akshata Murthy). ఆమె స్వ‌త‌హాగా డిజైన‌ర్. అంతే కాదు బిలియ‌నీర్ కూడా. ఈ అక్ష‌త మూర్తి మరెవ‌రో కాదు ప్ర‌పంచ ఐటీ రంగంలో టాప్ కంపెనీల‌లో ఒక‌టిగా పేరుగాంచిన భార‌తీయ కంపెనీ ఇన్ఫోసిస్ సంస్థ చైర్మ‌న్ నారాయ‌ణ మూర్తి, సుధా మూర్తిల కూతురే ఈ అక్షత‌.

వారికి రోహాన్ అనే త‌న‌యుడు కూడా ఉన్నారు. ఆమె ఇన్పోసిస్ లో భాగ‌స్వామిగా ఉన్నారు. ఇప్ప‌టికే దాని వాల్యూ పెర‌గ‌డంతో ఆమెకు డివిడెండ్ రూపంలో మ‌రికొంత ద‌క్కింది. ఇదిలా ఉండ‌గా 2022 సంవ‌త్స‌రానికి గాను అక్ష‌త మూర్తికి అక్ష‌రాల త‌న వాటాల‌పై డివిడెండ్ రూపంలో రూ. 126.61 కోట్లు పొందారు.

ఇది పూర్తి ఆదాయంగా ప‌రిగ‌ణిస్తారు ఆర్థిక రంగ నిపుణులు. కాగా ఇన్ఫోసిస్ లో 0.93 శాతం చొప్పున వాటా ఉంది ఆమెకు. ఇప్ప‌టి వ‌ర‌కు అక్ష‌త పేరుతో 3.89 కోట్ల షేర్లు ఉన్నాయి. వాటికి సంబంధించి ఇప్ప‌టి ధ‌ర‌తో పోలిస్తే రూ. 5,956 కోట్లు. అంటే బ్రిట‌న్ దివంగ‌త రాణి ఎలిజబెత్ -2 ఆదాయం కంటే ప‌ది రెట్లు ఎక్కువ అన్న‌మాట‌.

Also Read : అక్ష‌తా మూర్తి ..రిషి సున‌క్ స‌క్సెస్ సీక్రెట్

Leave A Reply

Your Email Id will not be published!