Akshay Kanti Bam: నామినేషన్ వెనక్కి తీసుకుని కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన ఇండోర్ అభ్యర్థి !
నామినేషన్ వెనక్కి తీసుకుని కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన ఇండోర్ అభ్యర్థి !
Akshay Kanti Bam: లోక్ సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ కు వరుస షాక్ తగులుతున్నాయి. తాజాగా ఇండోర్ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్… అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. ఇండోర్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ చివరి నిమిషంలో తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. అనంతరం ఆయన హస్తం పార్టీని వీడి అధికార బీజేపీలో చేరారు.
Akshay Kanti Bam Nomination Update
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోక్ సభ స్థానానికి నాలుగో విడతలో భాగంగా మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇండోర్(Indore) సిట్టింగ్ బీజేపీ ఎంపీ శంకర్ లాల్వానీకి పోటీగా కాంగ్రెస్ అక్షయ్ కాంతి బామ్(Akshay Kanti Bam) ని బరిలోకి దింపింది. అయితే నామినేషన్ల ఉపసంహరణకు నేడే (ఏప్రిల్ 29) ఆఖరి తేదీ. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం అక్షయ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ పత్రాలను వెనక్కి తీసుకున్నారు. ఆయన వెంట బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ మెండోలా కూడా ఉన్నారు.
కాంగ్రెస్ ఇండోర్ అభ్యర్థి అక్షయ్ బీజేపీలో చేరినట్లు మంత్రి విజయ్ వర్గియ పేర్కొన్నారు. అక్షయ్ తో ఒకే కారులో వెళ్తున్న ఫొటోను షేర్ చేస్తూ… ఆయన్ను పార్టీలోకి స్వాగతిస్తున్నట్లు చెప్పారు. దీనితో ఇండోర్ మరో సూరత్ కానుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్ లోని సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవడం, మిగిలిన వారు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.
Also Read : AP CM YS Jagan : చోడవరం వైసీపీ సభలో చంద్రబాబు పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు