PM Modi KK : కేకే హ‌ఠాన్మ‌ర‌ణం బాధాక‌రం – మోదీ

భార‌తావ‌నికి తీర‌ని విషాదం

PM Modi KK : ప్ర‌ముఖ సినీ గాయ‌కుడు కేకే హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఆయ‌న మృతితో యావ‌త్ సినీ రంగం తీవ్ర విషాదానికి లోనైంది. ప్ర‌ధానంగా బాలీవుడ్ షాక్ కు గురైంది. ఈ సంద‌ర్భంగా భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi KK)  తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు.

భార‌త దేశం ఒక గొప్ప క‌ళాకారుడిని కోల్పోయింద‌ని, ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరారు. చాలా మంది గాయ‌నీ, గాయ‌కులు క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. కోల్ క‌తాలో ఆయ‌న మంగ‌ళ‌వారం రాత్రి దాకా సంగీత క‌చేరి నిర్వహించారు.

అందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. అనంత‌రం తాను బ‌స చేస్తున్న హొట‌ల్ కు వెళ్లిన కొద్ది గంట‌ల్లోనే కేకే కుప్ప కూలి పోయారు. ఆస్ప‌త్రి వైద్యులు అప్ప‌టికే కేకే మ‌ర‌ణించార‌ని ప్ర‌క‌టించారు.

యావ‌త్ భార‌త‌మంతా శోక సంద్రంలో మునిగి పోయింది. ఎన్నో అద్భుత‌మైన పాట‌ల‌కు కేకే ప్రాణం పోశారు. ఇది ఊహించ‌ని వార్త‌. నేను త‌ట్టుకోలేక పోతున్నాను.

సంగీత ప్ర‌పంచానికి అత‌డు త‌న స్వ‌రంతో అందించిన పాట‌లు ఎప్ప‌టికీ నిలిచే ఉంటాయ‌ని పేర్కొన్నారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi KK) . ఈ దిగ్గ‌జ గాయ‌కుడు లేడ‌న్న వార్త‌ను నేను జీర్ణించు కోలేక పోతున్నాను.

భార‌త దేశానికి ఒక ర‌కంగా విషాదం. దీని నుంచి సినీ సంగీత ప్ర‌పంచం కోలుకోవాల‌ని కోరుతున్నాన‌ని పేర్కొన్నారు మోదీ. కేకే మ‌ర‌ణించార‌న్న వార్త‌ను చాలా మంది సినీ ప్రేమికులు, క‌ళాకారులు త‌ట్టుకోలేక త‌ల్ల‌డిల్లుతున్నారు.

Also Read : గాయ‌క దిగ్గ‌జం మూగ బోయిన స్వ‌రం

Leave A Reply

Your Email Id will not be published!