Akunuri Murali : ప్రీతి మృతిపై కమిటీ ఏర్పాటు చేయాలి
ఎస్డీఎఫ్ కన్వీనర్ , మాజీ ఏఐఎస్ ఆకునూరి మురళి
Akunuri Murali Preethi Death : వరంగల్ జిల్లా గిర్ని తాండాకు చెందిన డాక్టర్ ధారావత్ ప్రీతి మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సోషల్ డెమోక్రటిక్ ఫోరమ్ కన్వీనర్ , మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి(Akunuri Murali Preethi Death). అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
ఇలాంటి ఘటన మరోసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇందుకు సంబంధించి మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని ఆకునూరి మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
ఎంతో కష్టపడి చదువు కునేందుకు వచ్చిన అమ్మాయి పట్ల వివక్ష చూపించడం దారుణమని పేర్కొన్నారు ఎస్డీఎఫ్ కన్వీనర్. ఇప్పటికైనా సర్కార్ స్పందించాలని, నిజా నిజాలు తేల్చాలని, దోషులు ఎవరో బహిరంగంగా ప్రకటించాలని కోరారు. రేపొద్దున విద్యా సంస్థల్లో చదువు కోవాలంటేనే భయపడే పరిస్థితికి రాష్ట్రం దిగజారి పోయిందని ఆరోపించారు.
ఆడపిల్లల పట్ల రోజు రోజుకు దారుణాలు పెరిగి పోతున్నాయని, అడుగడుగునా మద్యం దుకాణాలు తెరవడం , మత్తు పదార్థాలు లభించడం వల్ల పరిస్థితి ఇలా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు ఆకునూరి మురళి. విద్యా వ్యవస్థ బాగు పడితేనే ఇలాంటి నేరాలు జరగకుండా ఉంటాయని పేర్కొన్నారు. విలువలు లేని విద్య వల్ల అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ,పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఆకునూరి మురళి.
ఇవాళ ఆడపిల్లలను విద్యా సంస్థలకు పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. నిరంతర పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉందన్నారు ఆకునూరి మురళి(Akunuri Murali).
Also Read : కేటీఆర్ కామెంట్స్ ఆర్ఎస్పీ సీరియస్