Smriti Mandhana : స్మృతీ మంధాన సత్తా చాటేనా
అత్యధిక ధరకు అమ్ముడు పోయిన క్రికెటర్
Smriti Mandhana WPL : ప్రపంచ క్రికెట్ లో తొలిసారిగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో ముంబై వేదికగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ను స్టార్ట్ చేసింది. ప్రస్తుతానికి 5 ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయి.
మార్చి 4న తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగింది. 143 రన్స్ తేడాతో ముంబై మట్టి కరిపించింది గుజరాత్ ను. ఇక మహిళల వేలం పాటలో రికార్డు ధరకు అమ్ముడు పోయిన ఏకైక మహిళా క్రికెటర్ ముంబైకి చెందిన స్టార్ హిట్టర్ స్మృతీ మంధాన(Smriti Mandhana WPL).
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఏకంగా రూ. 3.40 కోట్లకు కొనుగోలు చేసింది. అంతే కాదు తమ జట్టుకు కెప్టెన్ గా కూడా ఎంపిక చేసింది. మరో వైపు ఎవరూ ఊహించని రీతిలో హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను కోచ్ గా అపాయింట్ చేసింది. ఇది పక్కన పెడితే ఇవాళ ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మెక్ లానింగ్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ తో ఢీకొననుంది ఆర్సీబీ, ప్రస్తుతం అందరి కళ్లు స్మృతీ మంధానపై ఉన్నాయి.
ఆమెపై తీవ్రమైన ఒత్తిడి తప్పక ఉంటుంది. ఎందుకంటే భారీ ధరకు కొనుగోలు చేయడం, జట్టుకు నాయకత్వం వహించడం రెండూ తీవ్ర ఇబ్బందికరమే. అయితే ఎక్కడా తగ్గడం లేదు స్మృతీ మంధాన. తాను సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించింది. ఆర్సీబీ యాజమాన్యం సహకారంతో ముందుకు వెళతామని స్పష్టం చేసింది. మొత్తంగా క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం మంధాన(Smriti Mandhana) కోసం ఎదురు చూస్తున్నారు.
Also Read : ఆసిస్ ఫ్యాన్స్ తగ్గేదే లే..వైరల్