Banks For Sale : ఎస్బీఐ తప్ప అన్నీ ప్రైవేట్ పరం
సిఫారసు చేసిన ఎన్సీఏఈఆర్
Banks For Sale : దేశంలో ఏదీ ప్రజలకు చెందకుండా చేయడంలో భాగంగానే కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం యత్నిస్తోంది.
బడా వ్యాపారవేత్తలు, కార్పొరేట్ కంపెనీలకు మేలు చేకూర్చేలా మొదటి నుంచి వ్యవహరిస్తోందంటూ విపక్షాలు నెత్తీ నోరు బాదుకుంటున్నాయి.
ప్రభుత్వ సంస్థలను గంపగుత్తగా అమ్మకానికి పెట్టింది. చివరకు దేశాన్ని కూడా అమ్మకానికి పెడతారేమోనన్న ఆందోళన నెలకొంది. తాజాగా మరో బాంబు పేల్చింది.
ప్రభుత్వ బ్యాంకులను(Banks For Sale) ప్రైవేట్ పరం చేసేందుకు కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా , ఇండియన్ బ్యాంకులను ప్రైవేటీకరించాలని ఎన్సీఏఈఆర్ సిఫార్సు చేసింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహా అన్ని బ్యాంకులను ప్రైవేట్ కు ఇవ్వాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ప్రభుత్వానికి సూచించింది.
ఈ మేరకు పూనమ్ గుప్తా, ఆర్థిక వేత్త అరవింద్ పనగారియా నివేదిక తయారు చేశారు. వీరే సిఫారసు చేశారు. వీరు సమర్పించిన నివేదికలో ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకులు బాగా పని చేస్తాయని చెప్పడం విశేషం.
అంతే కాదు ఆర్బీఐని నియంత్రించే సామర్థ్యాన్ని ప్రభుత్వ యాజమాన్యం అడ్డుకుంటుందని పేర్కొనడం విచిత్రం. ఇక ప్రభుత్వ బ్యాంకుల పరంగా చూస్తే ఎస్బీఐ తప్ప ఇతర బ్యాంకుల పనితీరు ఆశాజనకంగా లేదని పేర్కొన్నారు.
రుణాలు, నిర్వహణ ఖర్చులు పెరిగాయని అందుకే వాటిని ప్రైవేట్ పరం చేయాలని సూచించారు. ఎన్ని సంస్కరణలు తీసుకు వచ్చినా ప్రభుత్వ బ్యాంకులు మెరుగు పడడం లేదని స్పష్టం చేశారు.
ఇందులో భాగంగానే 2016-17లో 27 ప్రభుత్వ బ్యాంకులకు గాను 12కి తగ్గించింది కేంద్రం. 31 మే 2022 నాటికి ఎస్బీఐ మాత్రమే గణనీయమైన వృద్దిని సాధించిందని మిగతావి ఆ దరిదాపుల్లోకి రాలేదని పేర్కొంది నివేదిక.
తక్కువ ప్రభుత్వ యాజమాన్యం కలిగిన పీఎస్బీలను ప్రైవేటీకరించాలని సూచించింది. నీతి ఆయోగ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులను ప్రైవేటీకరించాలని సూచించింది.
ఆస్తులపై, ఈక్విటీపై రాబడి, ప్రభుత్వ వాటాలు, అసెట్ బేస్ ప్రమాణాల ఆధారంగా ప్రైవేటీకరించాలని పేర్కొంది నివేదిక.
Also Read : ప్రభుత్వ బ్యాంకులపై కన్నేసిన కేంద్రం