Sanjay Bangar RCB Coach : ఆర్సీబీ హెడ్ కోచ్ పైనే ఆశలన్నీ
సంజయ్ బంగర్ ప్లాన్ ఏమిటో
Sanjay Bangar RCB Coach : ఐపీఎల్ 2022 ఆఖరి అంకానికి చేరింది. క్వాలిఫయిర్ -2లో శుక్రవారం అహ్మదాబాద్ లోని మోదీ మైదానంలో రాజస్తాన్ రాయల్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.
ఇరు జట్లు హోరా హోరీగా ఆడడం ఖాయం. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది సెమీ ఫైనల్ మ్యాచ్ లాంటింది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు చేరింది. తనతో ఎవరు వస్తారనే దానిపై ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వేచి చూస్తున్నాడు.
ఈసారి ఎలాగైనా సరే టైటిల్ ఎగరేసుకు పోవాలని ఉవ్విళ్లూరుతోంది ఆర్సీబీ. ఇప్పటి దాకా ఆ జట్టుకు అందని ద్రాక్ష పండుగా మిగిలి పోయింది.
ఇక రాజస్తాన్ రాయల్స్ స్టార్టింగ్ ఐపీఎల్ 2008లో దివంగత ఆసిస్ స్టార్ ప్లేయర్ షేన్ వార్న్ సారథ్యంలో టైటిల్ గెలుపొందింది. ఆనాటి నుంచి నేటి దాకా ఆ దరి దాపుల్లోకి రాలేదు.
సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్తాన్ ఎలాగైనా సరే కప్పు సాధించాలని పట్టుదలతో ఉంది. ఇక ఆర్సీబీ బలమైన లక్నో సూపర్ జెయింట్స్ ను ఎలిమినేటర్ మ్యాచ్ లో మట్టి కరిపించింది.
14 పరుగుల తేడాతో ఓడించింది. ఏ జట్టు అయినా సరే ఆ జట్టు విజయాల వెనుక ఒకరు తప్పక ఉంటారు. అదే హెడ్ కోచ్. ప్రస్తుతం ఆర్సీబీ బలమైన జట్టు వెనుక సంజయ్ బంగర్(Sanjay Bangar RCB Coach) ఉన్నాడు.
ఇవాళ జరిగే కీలక పోరులో ఎలాంటి వ్యూహాలు రూపొందిస్తున్నాడనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆ జట్టుకు ప్రధాన బలం బౌలింగ్.
Also Read : ఆర్సీబీ ఆయుధం బౌలింగ్ బలం