Allu Arjun : భ‌న్సాలీని క‌లిసిన బ‌న్నీ

హిందీ మూవీకి ప్లాన్

Allu Arjun  : క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , ల‌వ్లీ బ్యూటీ ర‌ష్మిక మందాన తో క‌లిసి న‌టించిన పుష్ప దుమ్ము రేపింది. బ‌న్నీ(Allu Arjun )కెరీర్ లో టాప్ లో నిలిచింది.

రూ. 360 కోట్ల‌కు పైగా వ‌సూలు సాధించిన‌ట్లు ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఇక పుష్ప మూవీ బిగ్ స‌క్సెస్ తో ఒక్క‌సారిగా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారి పోయారు.

(Bollywood Movie Makers) బ‌న్నీతో సినిమాలు తీసేందుకు ఉత్సుక‌త చూపించ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి బ‌న్నీ(Allu Arjun )ముంబైలో మెరిశాడు.

ఈ మేర‌కు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడిగా పేరొందిన (Sanjay Leela Bhansali) తో క‌లిశాడు. హైద‌రాబాద్ నుంచి ముంబైకి నేరుగా వెళ్లిన బ‌న్నీ డైరెక్టుగా ఫిల్మ్ మేక‌ర్ ను క‌లిశాడు.

ఇప్ప‌టికే అద్భుత‌మైన చిత్రాల‌ను తీసిన దిగ్గ‌జ డైరెక్ట‌ర్ గా పేరొందారు భ‌న్సాలీ. భార‌తీయ సినిమాలో న‌టిస్తున్న వారంతా ఆయ‌న తీసే సినిమాల‌లో ఒక్క‌సారి ఛాన్స్ అయినా లేదా ఒక్క పాత్ర అయినా ఇస్తే చాల‌ని అనుకుంటారు.

ఇదే స‌మ‌యంలో (Sanjay Leela Bhansali) ప్రాజెక్టుకు అల్లు అర్జున్ ఓకే చెప్పిన‌ట్లు బ‌య‌ట ప్ర‌చారం జ‌రుగుతోంది. ద‌క్షిణాది యోధుడి క‌థాంశంతో ఓ పీరియాడిక్ సినిమాను భ‌న్సాలీ ప్లాన్ చేశార‌ని దీనికి బ‌న్నీ ఓకే కూడా చెప్పిన‌ట్లు టాక్.

కాగా ఈ కొత్త మూవీకి సంబంధించి అధికారికంగా వెల్ల‌డించాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం బ‌న్నీ పుష్ప మూవీకి సీక్వెల్ లో న‌టిస్తున్నారు.

Also Read : పునీత్ రాజ్ కుమార్ కు డాక్ట‌రేట్

Leave A Reply

Your Email Id will not be published!