Allu Arjun : గూగుల్ సెర్చింగ్ లో అల్లు అర్జున్ టాప్

సౌతిండియా స్టార్ల‌లో టాప్ మ‌నోడు

Allu Arjun : తెలుగు సినిమాలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క‌లిగిన న‌టుడు అల్లు అర్జున్(Allu Arjun). డిఫ‌రెంట్ మేన‌రిజంతో విప‌రీతంగా క‌ష్ట‌ప‌డే మ‌న‌స్త‌త్వం క‌లిగిన న‌టుల్లో బ‌న్నీ ఒక‌డు.

ఏ సినిమా ఒప్పుకున్నా దానిని ద‌ర్శ‌కుడు ఊహించిన దానికంటే ఎక్కువ‌గా చేసి చూపించ‌డంలో త‌న‌కు త‌నే సాటి. డైలాగులు, న‌ట‌న‌, డ్యాన్సులు, ఫైట్స్ ఇలా ప్ర‌తి దానిలో వేరియేష‌న్ చూపించ‌డంలో టాప్ లో ఉన్నాడు బ‌న్నీ.

క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పుష్ప మూవీ అల్లు అర్జున్ ను ఓ రేంజ్ లోకి తీసుకు వెళ్లేలా చేసింది. పాన్ ఇండియా మూవీగా విడుద‌లై ఏకంగా రూ. 365 కోట్ల‌కు పైగా వ‌సూలు సాధించింది.

ప్ర‌ధానంగా బ‌న్నీ ఊర మాస్ గా న‌టించి మెప్పించాడు. అత‌డితో పాటు ర‌ష్మిక మంధాన‌, స‌మంత క‌లిసి న‌టించిన ఈ మూవీ బాక్సులు బ‌ద్ద‌లు కొట్టింది. తాజాగా ద‌క్షిణ భార‌త దేశంలో ఎంద‌రో స్టార్లు ఉన్నారు.

కానీ ఈ ఏడాది 2022 జూన్ వ‌ర‌కు అత్య‌ధికంగా వ‌ర‌ల్డ్ వైడ్ గా టాప్ లో ఉన్న సెర్చింగ్ ఇంజన్, టెక్ దిగ్గ‌జ కంపెనీ గూగుల్ లో అత్య‌ధికంగా ఎవ‌రీ అల్లు అర్జున్ అంటూ వెతికార‌ట‌.

ఇదే విష‌యాన్ని గూగుల్ వెల్ల‌డించింది. అత్య‌ధికంగా శోధించిన ఏకైక న‌టుడు అంటూ పేర్కొంది. ఆ త‌ర్వాత మిగ‌తా హీరోల గురించి వెతికారు.

ప్ర‌ధానంగా బ‌న్నీ పుష్ప మూవీతో అటు టాలీవుడ్ , కోలీవుడ్ , మాలీవుడ్ , బాలీవుడ్ లో ఊపేశాడు. ఇప్ప‌టికీ అల్లు అర్జున్(Allu Arjun)  అనే స‌రిక‌ల్లా పుష్ప మూవీ క‌దా అనే స్థాయికి తీసుకు వ‌చ్చేలా చేయ‌డంలో డైరెక్ట‌ర్ ను అభినందించ‌క త‌ప్ప‌దు.

Also Read : యూట్యూబ్ నుంచి సిద్దూ సాంగ్ తొలగింపు

Leave A Reply

Your Email Id will not be published!