Alvin Tse : షియోమీ ఇండియా జీఎంగా ఆల్విన్ త్సే

ప్ర‌క‌టించిన షియోమీ సంస్థ

Alvin Tse : ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ చైనాకు చెందిన షియోమీ ఇండియా జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ గా ఆల్విన్ త్సే(Alvin Tse) ని నియ‌మించింది.

దేశంలో కంపెనీ ఎదుర్కొంటున్న న్యాయ ప‌ర‌మై స‌వాళ్ల మ‌ధ్య ఆయ‌న‌ను నియ‌మించ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఆల్విన్ త్సే(Alvin Tse) షియోమీ ఇండోనేషియా మాజీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ . అంతే కాకుండా షియోమీ గ్లోబ‌ల్ , పోకో వ్య‌వ‌స్థాప‌క బృందం స‌భ్యుడిగా ఉన్నారు.

షియోమీ లో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ గా మ‌ను జైన్ ఎదిగారు. ఇదే స‌మ‌యంలో ఆ కంపెనీకి భారీ లాభాల‌ను తీసుకు వ‌చ్చేలా చేశారు.

రెండేళ్ల కింద‌ట పోకోకి మారిన అనూజ్ శ‌ర్మ మళ్లీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీస‌ర్ గా షియోమీ ఇండియాలో చేర‌నున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది.

కంపెనీ ప్ర‌క‌టించిన సంస్థాగ‌త మార్పుల‌లో భాగంగా ఆల్విన్ త్సే ను నియ‌మించింది. సంస్థ ప్ర‌కారం ముర‌ళీ కృష్ణ‌న్ చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ గా ఉన్నారు.

గ‌త ఏడాది మ‌ను జైన్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ గా ప‌దోన్న‌తి పొందిన త‌ర్వాత కంపెనీ ఇండియా కార్య‌క‌లాపాల‌కు చీఫ్ బిజినెస్ ఆఫీస‌ర్ గా ర‌ఘు రెడ్డిగా ఉన్నారు.

చీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్ గా స‌మీర్ బి.ఎస్. రావు నాయ‌క‌త్వం వ‌హించారు. మ‌ను జైన్ ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ మార్కెటింగ్ , పీఆర్ తో స‌హా అంత‌ర్జాతీయ వ్యూహానికి బాధ్య‌త వ‌హిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా షియోమీ బెదిరింపు క్లెయిమ్ త‌ర్వాత చైనా కంపెనీల‌తో న్యాయంగా వ్య‌వ‌హ‌రించిన బీజింగ్ భార‌త‌దేశాన్నికోరింది.

కంపెనీ బ్రాండ్ , మార్కెటింగ్ స్ట్రాట‌జీని హ్యాండిల్ చేస్తూ అనూజ్ శ‌ర్మ ఇండియాలో చీఫ్ మార్కెటింగ్ ఆఫీస‌ర్ గా మ‌ళ్లీ చేర‌తార‌ని కంపెనీ తెలిపింది.

జ‌న‌వ‌రిలో దిగుమ‌తి ప‌న్నుల‌ను ఎగవేసినందుకు షియోమీకి చెందిన రూ. 660 కోట్లు చెల్లించాల‌ని డీఆర్ఐ కంపెనీని కోరింది.

Also Read : బాలిక గ్యాంగ్ రేప్ పై మ‌హీంద్రా కామెంట్

Leave A Reply

Your Email Id will not be published!