Mukesh Ambani House : దుబాయ్ లో అంబానీ ఇల్లు కొనుగోలు

కొడుకు కోసం వ్యాపార‌వేత్త షాకింగ్ నిర్ణ‌యం

Mukesh Ambani House : రిల‌య‌న్స్ సంస్థ‌ల అధిప‌తి ముకేశ్ అంబానీ అత్యంత ఖ‌రీదైన ఇంటిని(Mukesh Ambani House) కొనుగోలు చేశారు. ఇప్ప‌టికే ఆయ‌న కుటుంబం పేరుతో ఎన్నో ఇళ్లు ఉన్నాయి.

ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన న‌గ‌రాల‌లో. తాజాగా త‌న చిన్న కొడుకు అనంత్ కోసం ఖ‌రీదైన ఇల్లును దుబాయిలో కొనుగోలు చేశాడు. దీని ఖరీదు తెలిస్తే షాక్ కు గురి కావాల్సిందే.

అర‌బ్ దేశంలోని పామ్ జుమేరాలోని భారీ భ‌వంతిని ఈ ఏడాది ప్రారంభంలో కొనుగోలు చేశారు. బీచ్ ప‌క్క‌న ఉంది ఈ ఇల్లు . ఇందులో 10 బెడ్ రూమ్ లు, ప్రైవేట్ స్పా, ఇండోర్, అవుట్ డోర్ కొల‌నులు ఉన్నాయి.

ప్ర‌స్తుతం దుబాయి న‌గ‌రం అత్యంత సంప‌న్నుల‌కు ఇష్ట‌మైన మార్కెట్ గా ఎదుగుతోంది. చాలా మంది వ్యాపార‌వేత్త‌లు, సెల‌బ్రిటీలు ఈ న‌గ‌రంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు.

అంబానీకి చెందిన రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ దుబాయ్ లో 80 మిలియ‌న్ డాల‌ర్ల విలువైన బీచ్ సైడ్ విల్లా ను చేజిక్కించుకున్నారు.

ఇది న‌గ‌రంలో అతి పెద్ద నివాస యోగ్య‌మైన ప్రాప‌ర్టీగా పేరుంది. ఈ ప్రాప‌ర్టీ మాత్రం చిన్న కొడుక్కి మాత్ర‌మే చెందింది కావ‌డం విశేషం. లావాదేవీ ప్రైవేట్ గా ఉన్నందున పేరు పెట్ట వ‌ద్దంటూ కోరడం విశేషం.

దుబాయ్ ప్ర‌భుత్వం గోల్డెన్ వీసాలు అందిస్తూ వ‌స్తోంది యూఏఈ ప్ర‌భుత్వం. ఇక్క‌డ ప్ర‌ధానంగా విదేశీయులు ఎవ‌రైనా స‌రే ఆస్తులు కొనుగోలుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

అంతే కాకుండా గతంలో విధించిన రూల్స్ ను స‌డ‌లించింది. ఇక ఈ ఖ‌రీదైన ఏరియాలో బ్రిటీష్ ఫుట్ బాల్ ఆట‌గాడు డేవిడ్ బెక్ హామ్ త‌న భార్య విక్టోరియా, బాలీవుడ్ మెగా స్టార్ షారుఖ్ ఖాన్ తో క‌లిసి అంబానీ త‌న‌యుడు కూడా ఉండ‌నున్నాడు.

Also Read : క్రికెట్ దిగ్గ‌జాల హ‌ల్ చ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!