Ambati Rayudu : ఐపీఎల్ లో భాగంగా ముంబై వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా జరిగింది. చివరి దాకా నువ్వా నేనా అన్న రీతిలో ఆట కొనసాగింది. ఆంధ్రా కుర్రాడు అంబటి రాయుడు(Ambati Rayudu )సత్తా చాటాడు.
క్రీజులో ఉన్నంత సేపు ధనా ధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కెప్టెన్ రవీంద్ర జడేజా, ఫైనల్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నా జట్టును కాపాడ లేక పోయారు.
ఈ తరుణంలో మ్యాచ్ చివరి అంచుల దాకా తీసుకు రావడంలో అంబటి రాయుడు సక్సెస్ అయ్యాడు. కేవలం 39 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అంబటి రాయుడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
39 బాల్స్ ఎదుర్కొని 78 రన్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 6 సిక్స్ లు ఉన్నాయి. చివరి వరకు నువ్వా నేనా అన్న రీతిలో ఆట కొనసాగింది. 4 ఓవర్లు 49 పరుగులు చేయాల్సిన సమయంలో ఆర్ష్ దీప్ రంగంలోకి దిగాడు మ్యాచ్ స్వరూపాన్నే పూర్తిగా మార్చేశాడు.
ఆఖరులో 2 ఓవర్లు మాత్రమే వేసిన ఆర్ష్ ద్వీప్ 14 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ కు ఫైనల్ ఫినిషర్ గా పేరొందిన మాజీ స్కిప్పర్ ధోనీ తన మెరుపులు మెరిపించ లేక పోయాడు.
ఇదే సమయంలో రవీంద్ర జడేజా కెప్టెన్ గా ఉన్నప్పటికీ తన జట్టును గట్టెక్కించ లేక పోవడంతో ఓటమి తప్పలేదు చెన్నై సూపర్ కింగ్స్ కు. మొత్తంగా ముంబై సరసన చేరేందుకు రెడీ అయ్యింది చెన్నై.
Also Read : రషీద్ ఖాన్ కేర్ టేకర్ కాదు – లారా