Amber Heard : జానీ డెప్ తాగితే రాక్షసుడవుతాడు
అందుకే విడాకుల కోసం దాఖలు చేశా
Amber Heard : ప్రపంచ సినీ రంగంలో మోస్ట్ పాపులర్ హీరో ఎవరైనా ఉన్నారంటే అతడి పేరు మాత్రం తప్పక గుర్తుకు వస్తుంది. అతడే జానీ డెప్.
తన అపూర్వమైన నటనతో, ప్రతిభా పాటవాలతో కోట్లాది మంది గుండెలలో నిలిచి పోయాడు. కానీ నటన వేరు, నటించడం వేరు.
కానీ అదే నటన జీవితంలో జీవిస్తే, దానినే వాస్తవంలోకి తీసుకు వస్తే ఎలా ఉంటుంది. ప్రస్తుతం అదే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు దిగ్గజ నటుడు జానీ డెప్.
ఈ దిగ్గజ నటుడి నుంచి తనకు ప్రాణ హాని ఉందని, తాను అతడిని తట్టుకోలేక పోతున్నానని వాపోయింది నటి అయిన అంబర్ హర్డ్ (Amber Heard) ఈ మేరకు తనకు జానీ డెప్ నుంచి విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది.
ఈ సందర్బంగా కోర్టు ముందు సంచలన విషయాలు వెల్లడించింది. ఆమె చెప్పింది విని యావత్ లోకం విస్తు పోయింది. ప్రధానంగా జానీ డెప్ అభిమానులు తట్టుకోలేక పోతున్నారు.
ఇప్పటికీ జానీ డెప్ అంటే తనకు ప్రేమ ఉందని, కానీ అతడు మద్యాన్ని సేవించనంత వరకు బాగానే ఉంటాడని, కానీ ఎప్పుడైతే మందు పుచ్చుకున్నాడో జానీ డెప్ ను తట్టుకోవడం కష్టమని వాపోయింది.
అతడు రాక్షసుడిగా మారి పోతాడని కన్నీటి పర్యంతమైంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని గ్రహించే తాను మే, 2016లో జానీ డెప్ నుంచి రక్షణ కావాలని , విడాకులు మంజూరు చేయాలని కోరారని తెలిపింది
ఈ 36 ఏళ్ల నటి తన మాజీ భర్త జానీ డెప్ తనపై దాఖలు చేసిన పరువు నష్టం విచారణలో జ్యూరీకి చెప్పింది. డ్రగ్స్ కు బానిసయ్యాడు.
మందు లేకుండా ఉండలేక పోతున్నాడు.
అతడిని మాన్పించే ప్రయత్నం చేశా. కానీ నేను సక్సెస్ కాలేక పోయానని చెప్పింది. జానీ డెప్ తనపై మొబైల్ విసిరాడని ఆరోపించింది.
ఇదిలా ఉండగా జానీ డెప్ ఆమె చెప్పినవన్నీ అబద్దమని పేర్కొన్నాడు.
ఆమె తనను హింసించిందంటూ వాపోయాడు. మూడుసార్లు ఆస్కార్ నామినీ అయిన జానీ డెప్ , హర్డీ 2009లో ది రమ్ డైరీలో కలుసుకున్నారు. 2015 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల తర్వాత విడాకులు మంజూరు చేయబడ్డాయి.
Also Read : ఎవరీ రితికా నాయక్ ఏమిటా కథ