United Nations Support : ఐక్యరాజ్య సమితిలో రష్యాకు మద్దతుగా నిలిచినా అమెరికా

ఐక్యరాజ్య సమితిలో యుక్రెయిన్ కు షాక్..

United Nations : ఉక్రెయిన్‌కు మద్దతు తెలుపుతూ ఐక్యరాజ్య సమితి(United Nations) మందుకొచ్చిన ఓ తీర్మానాన్ని అమెరికా తోసిపుచ్చింది. రష్యా(Russia)కు అనుకూలంగా ఓటు వేసి ఉక్రెయిన్‌కు ఊహించని షాకిచ్చింది. శాంతిస్థాపన కోసం ఉక్రెయిన్, ఇతర ఐరోపా దేశాలు ఐక్యరాజ్య సమితిలో సోమవారం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానికి అనుకూలంగా 93 సభ్య దేశాలు ఓటు వేయగా 18 దేశాలు ప్రతికూల ఓటు వేసాయి. మరో 65 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

United Nations Updates

యుద్ధ విమరణ, ఉక్రెయిన్(Ukraine) ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలంటూ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అమెరికా వ్యతిరేకంగా ఓటు వేసింది. తీర్మానంలోని భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యుద్ధానికి రష్యా కారణమని తీర్మానంలో పేర్కొనడాన్ని వ్యతిరేకించింది. అయితే, ఈసారి తీర్మానంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచిన వారి సంఖ్య తగ్గడం గమనార్హం. కాగా, ఈ తీర్మానికి పోటీగా అమెరికా(America) కూడా ఐక్యరాజ్య సమితిలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలంటూ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంలో రష్యా ప్రస్తావనే లేకపోవడంతో యూఎన్ సభ్య దేశాల మద్దతు లభించలేదు. అనంతరం ఈ తీర్మానికి భారీ మార్పులు చేసి కొత్త తీర్మానాన్ని యూఎన్ సభ్య దేశాలు ఆమోదింపజేసుకున్నాయి. దీనికి అనుకూలంగా 93 మంది ఓటు వేయగా 73 దేశాలు వ్యతిరేక ఓటు వేశాయి. మరో 8 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

కాగా,అమెరికా తొలుత ప్రతిపాదించిన తీర్మానానికి రష్యా మద్దతుగా నిలిచింది. సరైన దిశలో తొలి అడుగుగా అమెరికా తీర్మానాన్ని అభివర్ణించింది. అమెరికా అధ్యక్షుడిపై రష్యా రాయబారి ప్రశంసలు కురిపించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడికి శాంతి స్థాపనపై అసలేమాత్రం ఆసక్తి లేదన్న విషయం అమెరికా అధ్యక్షుడు అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. బైడన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉక్రెయిన్‌కు ఐక్యరాజ్య సమితిలో భారీ స్థాయిలో మద్దతు లభించింది. రష్యాతో తలపడుతున్న ఉక్రెయిన్‌కు ఆయుధాల కొరత రాకుండా బైడెన్ పలు చర్యలు తీసుకున్నారు.

ఇదిలా ఉంటే, 15 మంది సభ్యులున్న ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలోనూ యూఎస్ మరో తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది. ఈ తీర్మానం పాసయ్యేందుకు కనీసం 9 మంది సభ్యుల మద్దతుతో పాటు శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ నుంచి వ్యతిరేక ఓటు రాకూడదు. అయితే, ఫ్రాన్స్ మాత్రం ఈ తీర్మానంలోని భాషపై వ్యతిరేకించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిందన్న పదజాలం చేర్చాల్సిందేనని పట్టుబట్టింది.

Also Read : AP CM & Deputy CM : అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం పై స్పందించిన ఏపీ సర్కార్

Leave A Reply

Your Email Id will not be published!