Amit Shah : బంగ్లా సరిహద్దుల్లో చొరబాట్లు నిలిపివేస్తే శాంతినేలకొంటుంది

పెట్రాపోల్ ల్యాండ్ పోర్ట్ వద్ద టెర్మినల్ భవన నిర్మాణానికి రూ.500 కోట్లు వెచ్చించారు...

Amit Shah : బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు అక్రమ వలసలతో దేశంలో శాంతికి విఘాతం కలుగుతోందని కేంద్ర హోమంత్రి అమిత్‌షా ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దు చొరబాట్లను నిలిపివేస్తేనే పశ్చిమబెంగాల్‌లో శాంత నెలకొంటుందని అన్నారు. బెంగాల్‌లో ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి పెట్రాపోల్ ల్యాండ్ పోర్ట్‌ వద్ద కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ఆయన ఆదివారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2026లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలకు కళ్లెం వేస్తామని హామీ ఇచ్చారు. ” సరిహద్దులు అతిక్రమణను అడ్డుకునేందుకు చట్టపరమైన మార్గం లేనప్పడు అక్రమ వలసలు చోటుచేసుకుంటాయి. అక్రమ వలసలు ఇండో-బంగ్లాదేశ్ శాంతికి విఘాతం. బెంగాల్ ప్రజలకు నేను ఒక విషయం చెప్పదలచుకున్నాను. 2026లో మార్పును కోరుకోండి. మేము ఈ చొరబాట్లకు అడ్డుకట్ట వేస్తాం. చొరబాట్లు ఆగిపోతేనే బెంగాల్‌లో శాంతి సాధ్యం” అని అమిత్‌షా(Amit Shah) స్పష్టం చేశారు.

Amit Shah Comment

పెట్రాపోల్ ల్యాండ్ పోర్ట్ వద్ద టెర్మినల్ భవన నిర్మాణానికి రూ.500 కోట్లు వెచ్చించారు. బెంగాల్‌లో శాంతిని నెలకొల్పేందుకు ల్యాండ్ పోర్టులు చాలా ముఖ్యమని అమిత్‌షా ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య కనెక్టివిటీ, సత్సంబంధాల మెరుగుగు ల్యాండ్ పోర్టులు అవసరమని అన్నారు. ఇందువల్ల ఉభయదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా బలోపేతమవుతాయని చెప్పారు. బెంగాల్ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపుతున్న నిధులను టీఎంసీ ప్రభుత్వం దోచుకుంటోందని ఆయన ఆరోపించారు. గత పదేళ్ల ఎన్డీయే హయాంలో బెంగాల్‌కు రూ.56,000 కోట్లు ఇచ్చిందని, ఆ సొమ్ము ఎన్‌ఆర్ఈజీఏ లబ్దిదారులకు ఇచ్చారా? తృణమూల్ కాంగ్రెస్ వర్కర్ల చేతుల్లోకి వెళ్లిపోయాయా? అని తాను ఈరోజు ప్రశ్నిస్తున్నానని అన్నారు. దీనిపై దయచేసి ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. 2026లో రాజకీయ మార్పును రాష్ట్రంలో తీసుకురావాలని ప్రజలకు అమిత్‌షా పిలుపునిచ్చారు.

Also Read : CM Revanth Reddy : మూసీ పునరుజ్జివంపై సంచలన విష్యాలు వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!