Amit Shah : జమ్మూ కాశ్మీర్ ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ రక్షణ మంత్రి ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో మరోసారి స్పష్టమైంది...

Amit Shah : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ బిజీగా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో ఆర్టికల్ 370 చర్చకు వచ్చింది. ఆర్టికల్ 370 రద్దు చేస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ హామీ ఇస్తోంది. ఎన్సీ వాదనలతో పాకిస్థాన్ ఏకీభవించింది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, కాంగ్రెస్, పాకిస్థాన్‌ అవలంభిస్తోన్న విధానాలను కేంద్ర ప్రభుత్వం తప్పు పట్టింది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ విషయంలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ వైఖరితో ఏకీభవిస్తున్నామని పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా స్పష్టం చేశారు. కశ్మీర్‌లో కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 పునరుద్దరణ గురించి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రకటన చేసింది. ఆ అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు. పాకిస్థాన్ రక్షణ మంత్రి మాత్రం కాంగ్రెస్ పార్టీని కలిపి మాట్లాడారు. ఆ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Amit Shah Comment

పాకిస్థాన్ రక్షణ మంత్రి ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో మరోసారి స్పష్టమైంది. కశ్మీర్ విషయంలో ఆ రెండు ఒకేవిధమైన ఏజెండా, ఉద్దేశంతో ఉన్నాయని అమిత్ షా స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా విపక్ష నేత రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక శక్తులకు అండగా నిలబడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్‌పై భారత దేశం చేసిన ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ దాడులకు సంబంధించి రుజువు అడిగి భారత సైన్యాన్ని కించపరిచాడని మండిపడ్డారు. దేశ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. దేశ వ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చేతులు కలుపుతూనే ఉందని అమిత్ షా విమర్శించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉందనే విషయాన్ని మరచిపోయారని గుర్తుచేశారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించబోమని తేల్చి చెప్పారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో అణచి వేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.

Also Read : Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌ సీఎస్‌తో జూడాల రెండోవిడత చర్చలు

Leave A Reply

Your Email Id will not be published!