Amit Shah : ఉగ్రవాదాన్ని అంతం చేసేంతవరకు పాక్ తో చర్చలకు తావులేదు

అయితే ఉగ్రవాదం అంతమొందేంత వరకూ చర్చలు కుదరదని మేము అంటున్నాం...

Amit Shah : ఉగ్రవాదాన్ని అంతమొందించేంత వరకూ పాకిస్థాన్‌తో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. నేషనల్ కాంగ్రెస్, కాంగ్రెస్ సహా వివిధ విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టుగా 370 అధికరణ రద్దును తిరిగి పునరుద్ధరించేది లేదన్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నౌషెరాలో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా(Amit Shah) మాట్లాడారు. ” 370వ అధికరణను తిరిగి తెస్తామని ఫరూక్ అబ్దుల్లా చెబుతున్నారు. ఫరూక్ సాహెబ్.. 370 అధికరణను ఎవరూ వెనక్కి తేలేరు. ఇప్పుడు బంకర్లు అవసరం లేదు. బుల్లెట్లు కాల్చడానికి ఎవరికీ దమ్ము సరిపోదు” అని అమిత్‌షా అన్నారు.

షేక్ అబ్దుల్లా జెండాను తిరిగి తేవాలని వారనుకుంటున్నారని, కానీ జమ్మూకశ్మీర్‌లో ఎగిరేది మన త్రివర్ణ పతాకం మాత్రమేనని స్పష్టం చేశారు. 30 ఏళ్లుగా ఉగ్రవాదం కొనసాగుతోందని, 30 ఏళ్లలో 3000 రోజులు జమ్మూలో కర్ఫ్యూ విధించారని, 40 వేల మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మళ్లీ ఆ రోజులు ఎలా తేవాలనుకుంటున్నారో ఫరూక్ అబ్దుల్లానే చెప్పాలని అన్నారు. జమ్మూకశ్మీర్ తగలబడుతుంటే ఫరూక్ అబ్దుల్లా మాత్రం లండన్‌లో హాలిడేస్ గడిపారంటూ అమిత్‌షా(Amit Shah) విమర్శలు గుప్పించారు.

Amit Shah Comment…

”పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని వాళ్లు అంటున్నారు. అయితే ఉగ్రవాదం అంతమొందేంత వరకూ చర్చలు కుదరదని మేము అంటున్నాం. జైళ్ల నుంచి ఉగ్రవాదులను విడిచిపెట్టాలని వారు కోరుకుంటున్నారు. ఏ ఒక్క ఉగ్రవాదని కానీ, రాళ్లు రువ్వే వాళ్లను కానీ జైళ్ల నుంచి విడిచిపెట్టేది లేదు. బీజేపీ ఇందుకు హామీగా ఉంటుంది” అని అమిత్‌షా స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఎన్‌సీ, పీడీపీలు గత 70 ఏళ్లుగా కొండ ప్రాంతాలలో ఉండేవారికి రిజర్వేషన్ హక్కులు లేకుండా చేసిందని, మోదీ మాత్రం కొండ ప్రాంతాల ప్రజలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో తొలి విడత పోలింగ్ సెప్టెంబర్ 18న జరుగగా, 61.13 శాతం పోలింగ్ నమోదైంది. రెండో విడత పోలింగ్ ఈనెల 25న జరుగనుండగా, అక్టోబర్ 5న జరిగే మూడో విడతతో పోలింగ్ ముగుస్తుంది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

Also Read : Tirupati Laddu Row : తాడేపల్లిలో జగన్ నివాసం వద్ద హిందూ ధార్మిక సంఘాల ఆందోళనలు

Leave A Reply

Your Email Id will not be published!