Anand Mahindra : ఢిల్లీ గ్రాడ్యుయేట్స్ ప్రతిభకు ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రాకు కూడా ఆ ఆవిష్కరణ నచ్చింది...
Anand Mahindra : ప్రస్తుత బిజీ బిజీ జీవితంలో వ్యాయామం కోసం సమయం కేటాయించేందుకు ఎవరికీ సమయం దొరకడం లేదు. చాలా మందికి జిమ్‌కి వెళ్లడానికి సమయం దొరకదు. ఫిట్‌గా మారాలనే కోరిక ఉన్నప్పటికీ చాలా మంది జిమ్‌కు వెళ్లలేరు. అలాంటి వారి కోసం ఢిల్లీ ఐఐటీకి చెందిన విద్యార్థులు వినూత్న ఆవిష్కరణ చేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra)కు కూడా ఆ ఆవిష్కరణ నచ్చింది. దీంతో ఆయన తన ట్విటర్ ఖాతాలో ఆ వీడియోను పంచుకుని ప్రశంసలు కురిపించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Anand Mahindra Appreciates
ఢిల్లీ ఐఐటీకి చెందిన అనురన్ డాని, అమన్ రాయ్, అమల్ జార్జ్, రోహిత్ పటేల్ అనే నలుగురు గ్రాడ్యుయేట్లు ఈ హోమ్ జిమ్‌ను రెడీ చేశారు. దీనికి “ఏరోలీప్ ఎక్స్” అని పేరు పెట్టారు. ముఖ్యంగా చిన్న చిన్న ఫ్లాట్లు, ఇల్లు, హోటల్స్‌లో ఈ పరికరాన్ని ఉపయోగించి వర్కవుట్స్ చేసుకోవచ్చు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ మెషిన్‌ను ఉపయోగించి 150కు పైగా వ్యాయామాలను చేసుకోవచ్చు. నిపుణులైన ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్ సూచనలకు సంబంధించి వంద గంటలకు పైగా కంటెంట్ ఈ మెషిన్‌లో ఉంటుంది. శరీరంలోని ప్రతి కండరాన్ని కదిలించేలా వర్కవుట్లు ఉంటాయి.
ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ “జిరోదా” వ్యవస్థాపకుడు నితిన్ కామత్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం పెట్టుబడి పెట్టారు. ఈ మెషిన్‌లో ఏఐ ఆధారిత ట్రైనింగ్ సెషన్లు ఉంటాయి. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. “ఈ హోమ్ జిమ్ పరికరాన్ని ఢిల్లీకి చెందిన నలుగురు గ్రాడ్యుయేట్లు రూపొందించారు. ఇదేమంత రాకెట్ సైన్స్ కాదు. ఈ పరికరాన్ని చిన్న హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, చిన్న ఇళ్లలోనూ ఉపయోగించుకునేలా డిజైన్ చేశారు. మెకానిక్స్, ఫిజికల్ థెరపీని అనుసంధానిస్తూ ఈ పరికరాన్ని తయారు చేయడం గొప్ప విషయం“ అని ఆనంద్ మహీంద్రా కామెంట్ చేశారు.
Also Read : IND vs NZ : యశస్వి జైస్వాల్ జోరుతో విజయానికి చేరువలో భారత్