Anand Mahindra : దేశం గర్వించ దగిన విజయం
థామస్ కప్ గెలుపుపై మహీంద్రా
Anand Mahindra : భారత దేశం గర్వించ దగిన వ్యాపారవేత్తలలో మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఒకరు . ఆయన కూడా టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ రతన్ టాటా మాదిరిగానే ఈ దేశం అంటే వల్లమాలిన అభిమానం.
ప్రధానంగా దేశంలో ఎక్కడ ఏ చిన్న అంశం తన దృష్టికి వచ్చినా వెంటనే పంచుకుంటారు. ఎవరైనా సరే కుల, మతాలకు అతీతంగా ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహిస్తారు. గుర్తించి వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు.
ఇది చాలా మంది వ్యాపారవేత్తలలో ఉండదు. తాము సంపాదించిన దానిలో కొంత సమాజానికి ఇవ్వడం అనేది ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, హెచ్ సీ ఎల్ చైర్మన్ శివ నాడర్ , రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ప్రత్యేకమైన వ్యక్తులు.
ఇక వీరందరి కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో చురుకుగా ఉండేది ఎవరు అంటే ఒక్క ఆనంద్ మహీంద్రానే. ఆయన ట్విట్టర్ లో నిత్యం పరిశీలిస్తుంటారు.
తనకు తోచిన దేశానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఆయన ప్రస్తావిస్తారు. చర్చకు వచ్చేలా చేస్తారు. తమిళనాడులో వయసు పెరిగినా నేటికీ దోసెలు వేసే అవ్వకు ఇల్లు కట్టించి ఇచ్చారు ఆనంద్ మహీంద్రా.
తాజాగా భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు 73 ఏళ్ల తర్వాత తొలిసారిగా థామస్ కప్ గెలుచుకుంది. 14 సార్లు ఛాంపియన్ గా నిలిచిన డిఫెండింట్ ఛాంపియన్ అయిన ఇండోనేషియాను 3-0 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది.
ఈ సందర్భంగా భారత జట్టు విజయంలో పాలు పంచుకున్న ప్రతి ఆటగాడిని ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ప్రత్యేకంగా అభినందించారు. మీరు సాధించిన ఈ విజయం దేశానికి గర్వ కారణమని ప్రశంసించారు.
ఇలాంటి గెలుపులు మరిన్ని సాధించాలని కోరారు. యావత్ భారతావని మిమ్మల్ని చూసి గర్విస్తోందని పేర్కొన్నారు.
Also Read : 23 నుంచి మహిళల టీ20 ఛాలెంజ్