Anant Ambani : త్వరలో అంబానీ ఇంట పెళ్లి సందడి..2500 రకాల ఐటమ్స్ అట..

ప్రస్తుతం అంబానీ ఫ్యామిలీ ఈ వేడుకలకు అనూహ్యంగా సిద్ధమైంది

Anant Ambani : ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన స్నేహితురాలు రాధిక మర్చంట్‌ని పెళ్లి చేసుకోబోతున్నాడు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మార్చి 1 నుంచి 3 వరకు ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల కోసం దాదాపు 1,000 మంది వ్యాపారవేత్తలు భారతదేశాన్ని సందర్శిస్తారట. ఈ వేడుకకు బిల్ గేట్స్, ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కూడా హాజరుకానున్నారు.

Anant Ambani Marriage Updates

ప్రస్తుతం అంబానీ ఫ్యామిలీ ఈ వేడుకలకు అనూహ్యంగా సిద్ధమైంది. ఈ సందర్భంగా జరగబోయే విందు హాట్ టాపిక్‌గా మారింది. ఇండోర్‌కు చెందిన 65 మంది చెఫ్‌ల ద్వారా ఆహారాన్ని తయారు చేయనున్నారు. భారతీయ వంటకాలతో పాటు పార్సీ, థాయ్, మెక్సికన్ మరియు జపనీస్ వంటకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగలో మొత్తం 2,500 రకాల వంటకాలు రెడీ చేయిస్తున్నారట. మూడు రోజులలో, 75 అల్పాహారం ఐటమ్స్, 225 లంచ్ ఐటమ్స్ మరియు 275 డిన్నర్ ఐటమ్స్ సిద్ధం ఛాయేస్తున్నారట.

ఈ మూడు రోజులలో మధ్యాహ్నం 12 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు ప్రత్యేక మిడ్ నైట్ మీల్స్ కూడా ఉందట. ఇందుకోసం 85 రకాల వంటకాలను తయారుచేస్తారు. ముఖేష్ అంబానీ(Mukesh Ambani) తల్లి కోకిలా బెన్ జామ్‌నగర్‌కు చెందినవారు. ముఖేష్ భార్య నీతా అంబానీ కూడా తన స్వచ్ఛంద సంస్థ రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా నగర అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జామ్‌నగర్‌లోనే అనంత్‌కు పెళ్లి చేయాలని అంబానీ కుటుంబం నిర్ణయించింది.

Also Read : PM Modi : అంతరిక్షంలోకి వెళ్లే ఆ నలుగురి పేర్లను రివీల్ చేసిన ప్రధాని

Leave A Reply

Your Email Id will not be published!