Ananthapur : రేపు, ఎల్లుండి ఆ జిల్లాలో భారీ వర్ష సూచన..ఆ రెండు రోజులు స్కూళ్లకు సెలవు
లోతట్టుప్రాంతాలను గుర్తించి ఎక్కడా జనం ఇబ్బందులు పడకుండా, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు...
Ananthapur : ఈనెల 16, 17 తేదీలలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. వాతావరణం బాగుంటే సెలవులను రద్దు చేస్తామన్నారు. కలెక్టరేట్లోను, అన్నిమండల కేంద్రాలలోను ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈనెల16, 17 తేదీలలో పల్లెపండుగ కార్యక్రమాల విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుకొని వాయిదా వేసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రమాదకరం గా ఉన్న బ్రిడ్జిలు, భవనాలను గుర్తించాలని అక్కడకు ఎవరిని వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Ananthapur Rains..
లోతట్టుప్రాంతాలను గుర్తించి ఎక్కడా జనం ఇబ్బందులు పడకుండా, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇరిగేషన్ ట్యాంకులను తహసీల్దార్, మైనర్ ఇరిగేషన్‌శాఖ అధికారులు తనిఖీ చేయాలన్నారు. ఆట్యాంకుల వద్ద వీఆర్ఓ, వీఆర్ఏలను పర్యవేక్షణకు నియమించాలని ఆదేశించారు. వర్షాల గురించి ముందుగానే గ్రామాలలో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తంచేయాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, వ్యవసాయశాఖ జేడీ ఉమా మహేశ్వరమ్మ, సీపీఓ అశోక్‌కుమార్, ఎల్డీఎం నర్సింగరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ ఈ.బీ.దేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Also Read : CAT : ఐఏఎస్ ల పిటిషన్ ను నేడు విచారించనున్న ‘కాట్’