Andre Russell : రస్సెల్ విధ్వంసం తప్పని పరాజయం
19 బంతులు 3 ఫోర్లు 5 సిక్సర్లు
Andre Russell : ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆండ్రూ రస్సెల్(Andre Russell) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
మొహసిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్ , జేసన్ హోల్డర్ లకు చుక్కలు చూపించాడు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా 101 పరుగులకే చాప చుట్టేసింది. 75 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది
. ఈ తరుణంలో రస్సెల్ కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడాడు. లక్నోలో క్వింటన్ డికాక్ , దీపక్ హూడా, స్టాయినిస్ దుమ్ము రేపితే కోల్ కతా నైట్ రైడర్స్ నుంచి రస్సెల్ ఒక్కడే దుమ్ము రేపాడు. ఈ డేంజర్ మ్యాన్ విధ్వంసానికి లక్నో బెంబేలెత్తి పోయింది.
కేవలం 19 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. ఇందులో 3 ఫోర్లు 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. మొత్తం 45 రన్స్ చేశాడు. రస్సెల్ ఒకవేళ ఇంకొంచెం సేపు క్రీజులో ఉండి ఉంటే లక్నో సూపర్ జెయింట్స్ ఆశలు ఆవిరి అయి ఉండేవి.
రాకెట్ లాగా వచ్చిన బంతుల్ని ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డాడుఆండ్రూ రస్సెల్ (Andre Russell). ఇక కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో శ్రేయస్ అయ్యర్ 6 రన్స్ చేస్తే బాబా ఇంద్రజిత్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
నితీశ్ రాణా 2 పరుగులు చేస్తే రింకూ సింగ్ 6 రన్స్ , అనుకూల్ రాయ్ సున్నాకే వెనుదిరిగితే ఆరోన్ పింఛ్ 14 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు.
ఇక ఆవేష్ ఖాన్ , జేసన్ హోల్డర్ మూడు వికెట్ల చొప్పున పడగొట్టారు. తమ సత్తా చాటారు. కోల్ కతా పతనాన్ని శాసించారు.
Also Read : లక్నో సెన్సేషన్ కోల్ కతా పరేషాన్