TPCC Row : కాంగ్రెస్ లో కల్లోలం కమిటీలపై ఆగ్రహం
బెల్లయ్య నాయక్..కొండా సురేఖ గుడ్ బై
TPCC Row : ఏఐసీసీ ఏర్పాటు చేసిన టీపీసీసీ కమిటీల ఎంపిక వ్యవహారం తీవ్ర గందరగోళానికి(TPCC Row) దారి తీసింది. పని చేసిన వారికి చోటు దక్కలేదంటూ రాజీనామాల బాట పట్టారు. ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి పార్టీని వీడారు.
మరో వైపు తాజాగా నియమించిన కమిటీల్లో తమకు ప్రాతినిధ్యం లేక పోవడాన్ని నిరసిస్తూ కీలక నేతలు తమ పదవులకు గుడ్ బై చెప్పడం కలకలం రేపుతోంది. కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీల్లో తనకు ఛాన్స్ ఇవ్వక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కొండా సురేఖ.
ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఆ లేఖను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అందజేశారు. గత కొంత కాలం నుంచి పార్టీ తరపున వాయిస్ వినిపిస్తూ వస్తున్న బెల్లయ్య నాయక్ తనకు చోటు దక్కక పోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పీసీసీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆయన రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు. బెల్లయ్య నాయక్ జాతీయ ఆదివాసీ కాంగ్రెస్ సెల్ వైస్ చైర్మన్ గా ఉన్నారు. అయితే జాతీయ స్థాయిలో ఉన్న తనకు రాజకీయ వ్యవహారాల కమిటీలో(TPCC Row) ఎందుకు చోటు ఇవ్వలేదంటూ నిలదీశారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు ధోరణి తప్ప ఇంకోటి కాదని ఆరోపించారు.
ప్రధానంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నాయకులపై పార్టీ చిన్న చూపు చూస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్న ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవులు వద్దనుకున్న తనకు ఈ పోస్టులు ఓ లెక్క కాదన్నారు.
గతంలో వేరే పార్టీల్లో ఉన్న వారికి ప్రయారిటీ ఇచ్చారని, కానీ పార్టీని ముందు నుంచి నమ్ముకుని పని చేసిన వారిని పరిగణలోకి తీసుకోలేదంటున్నారు సీనియర్లు. ఉన్నత వర్గాలకే ప్రయారిటీ ఇస్తున్నారని వాపోతున్నారు. ఏది ఏమైనా కొత్త కమిటీల ఏర్పాటు కొత్త చిచ్చును రేపుతోంది.
Also Read : మోదీ సింహం తట్టుకోవడం కష్టం – బండి