Anil Ambani VS Elon Musk : అంబానీ మ‌స్క్ బిగ్ ఫైట్

టెలికాం రంగంలో నువ్వా నేనా

Anil Ambani VS Elon Musk : భార‌తీయ వ్యాపార రంగంలో టాప్ లో కొన‌సాగుతున్నారు రిల‌య‌న్స్ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ అనిల్ అంబానీ(Anil Ambani). ఆయ‌న ఒక ప‌ట్టాన ఓట‌మిని ఒప్పుకోరు. ఇప్ప‌టికే త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని అంత‌కంత‌కూ విస్త‌రించుకుంటూ పోతున్నారు. ఇక టెలికాం రంగాన్ని శాసిస్తోంది రిల‌య‌న్స్ జియో. నెట్ క‌నెక్టివిటీలో జియో దెబ్బ‌కు మిగ‌తా కంపెనీలు ఠారెత్తి పోతున్నాయి. ఇక ప్ర‌పంచ వ్యాపార సామ్రాజ్యంలో ఎవ‌రు ఎప్పుడు ఆధిప‌త్యం చెలాయిస్తారో చెప్ప‌లేం.

ఒకానొక ద‌శ‌లో టాప్ లో కొన‌సాగుతూ వ‌చ్చిన ఎయిర్ టెల్ సైతం పెట్టే బేడా స‌ర్దుకోవాల‌ని అనుకుంది. న‌మ్మ‌కం, నాణ్య‌త , సర్వీస్ విష‌యంలో స్ట్రిక్ట్ గా ఉండ‌డంతో రిల‌య‌న్స్ జియోతో పోటీ ప‌డుతోంది మెల మెల్ల‌గా. ఒక ర‌కంగా చెప్పాలంటే భార‌త దేశంలోనే కాదు ప్ర‌పంచంలోనే అత్య‌ధిక వినియోగ‌దారులు క‌లిగిన సంస్థ‌గా రిల‌య‌న్స్ జియో నిలిచింది.

ప్ర‌స్తుతం రిల‌య‌న్స్ జియోకు గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు ప్ర‌పంచ కుబేరుడిగా పేరు పొందిన టెస్లా చైర్మ‌న్, ట్విట్ట‌ర్ సిఇఓ , స్పేస్ ఎక్స్ అధిప‌తి ఎలాన్ మ‌స్క్. త‌న కంపెనీకి సంబంధించి అంత‌రిక్షంలో శాటిలైట్ ద్వారా నెట్ క‌నెక్టివిటీని అంద‌జేస్తుంది. ఇదిలా ఉండ‌గా త‌మ వ్యాపారం దెబ్బ తింటుంద‌ని భావించిన రిల‌య‌న్స్ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే ఎలాన్ మ‌స్క్ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

భార‌త ప్ర‌భుత్వానికి తాను ట్యాక్స్ చెల్లించి లైసెన్స్ తెచ్చుకునేందుకు ద‌ర‌ఖాస్తు చేశాడు. దీంతో భార‌త దేశం శాటిలైట్ బ్రాడ్ బాండ్ మార్కెట్ లో ప‌ట్టు సాధించేందుకు స్టార్ లింక్ కోసం మ‌స్క్ ముందుకు వ‌చ్చాడు. ఇద్ద‌రి మ‌ధ్య ఆధిప‌త్య పోరులో ఎవ‌రు గెలుస్తార‌నేది చూడాలి.

Also Read : Leo Naa Ready Song : షేక్ చేస్తున్న విజ‌య్ లియో సాంగ్

Leave A Reply

Your Email Id will not be published!