Anil Ravipudi : ఛాన్స్ ఇస్తే మ‌ళ్లీ చేయాల‌ని ఉంది

ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కామెంట్

Anil Ravipudi : ప్రిన్స్ మ‌హేష్ బాబు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఎందుకంటే ఆయ‌న మిగ‌తా లాంటి వాళ్ల లాగా కాదు. ఆయ‌న‌కు టైమ్ సెన్స్ తో పాటు కామెడి సెన్స్ ఎక్కువ‌. అందుకే ప్ర‌తి ద‌ర్శ‌కుడు ఒక్క సినిమానైనా మ‌హేష్ బాబుతో సినిమా తీయాల‌ని క‌ల‌లు కంటారు.

నాకు అనుకోకుండా చాన్స్ ద‌క్కింది. అది స‌రిలేరు నీకెవ్వ‌రు మూవీలో. ఆయ‌న‌తో సినిమా తీస్తున్ప‌ప్పుడు న‌న్ను నేను మ‌రిచి పోయా. ఆయ‌న ద‌ర్శ‌కుల‌కు కావాల్సిన హీరో. మిత్రుడు ప‌రుశురామ్ (బుజ్జీ) ఒక ర‌కంగా ల‌క్కీ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఎందుకంటే స్టార్ లాంటి ప్రిన్స్ తో ఇన్నేళ్ల పాటు జ‌ర్నీ చేసినందుకు . సినిమా మ‌హేష్ బాబు స్టామినా ఏమిటో నిరూపించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడంటూ కితాబు ఇచ్చాడు అనిల్ రావిపూడి(Anil Ravipudi).

ఇక ప‌రుశురామ్ తెర‌కెక్కిన స‌ర్కార్ వారి పాట ఈనెల 12న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. మూవీ మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో భారీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రిగింది.

అనిల్ రావిపూడి(Anil Ravipudi) మ‌హేష్ బాబును ఆకాశానికి ఎత్తేశాడు. ఇంకోసారి గ‌నుక ఛాన్స్ ఇస్తే తాను అదృష్టంగా భావిస్తాన‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్ , 14 రీల్స్ సంస్థ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

ట్రైల‌ర్ చూశాను. అద్భుతంగా తెర‌కెక్కించాడంటూ ప‌రుశురామ్ ను అనిల్ రావి పూడి(Anil Ravipudi) ప్ర‌త్యేకంగా అభినందించాడు. మ‌హేష్ బాబు న‌ట‌న అమోఘ‌మ‌న్నాడు. ఏది ఏమైనా స‌ర్కార్ వారి పాట హిట్ కావ‌డం ప‌క్కా అని అన్నారు.

 

Also Read : సినిమా చూశాక క‌ళావ‌తిగా గుర్తిస్తారు

Leave A Reply

Your Email Id will not be published!