Ankiti Bose : ఫోటోలు..ఫైల్స్ దుర్వినియోగం – మాజీ సిఇఓ
రక్షణ కావాలని కోరిన అంకితి బోస్
Ankiti Bose : సింగపూర్ స్టార్టప్ జిలింగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న ప్రవాస భారతీయురాలు అంకితి బోస్ సంచలన కామెంట్స్ చేశారు.
తనకు తెలియ కుండానే తన ఫోటోలు, తాను ఇతరులతో చేసిన చాట్ (సంభాషణలు) లను తన పర్మిషన్ లేకుండా దుర్వినియోగం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఈ మాజీ సిఇఓ అంకితి బోస్(Ankiti Bose) తాను ఇప్పటి దాకా ఉపయోగిస్తున్న సామాజిక మాధ్యమాలకు సంబంధించిన సంస్థలకు అప్పీల్ చేశారు.
ఫోటోలు, చాట్ ను అడ్డం పెట్టుకుని మరింతగా తనను లింగిజో సంస్థ యాజమాన్యం తనను ఇబ్బందికి గురి చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
తన అకౌంట్లకు సెక్యూరిటీ కల్పిస్తూ తనకు వ్యక్తిగతం రక్షణ ఇవ్వాలని ఆమె కోరారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ప్రస్తుతం చర్చకు దారి తీశాయి.
ఇదిలా ఉండగా జిలింగో సింగపూర్ లో ఫ్యాషన్ కంపెనీ. భారీ ఆదాయాన్ని గడించింది. కాగా భారత్ కు చెందిన అంకితి బోస్ ను తీవ్రమైన ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
విచారణ చేపట్టిన యాజమాన్యం ఇటీవల ఆమెను తొలగించింది విధుల్లోంచి. తన అనుమతి లేకుండానే తన ఫోటోలు, చాట్ లు, డాక్యుమెంట్ లను యాక్సెస్ చేసి షేర్ చేశారంటూ ఆరోపించారు అంకితి బోస్(Ankiti Bose).
ఇది పూర్తిగా హానికరం, ఎవరు చేస్తున్నారో తెలియడం లేదన్నారు. దుస్తుల వ్యాపారులు, కర్మాగారాలకు సాంకేతికతను అందించే ఆన్ లైన్ ఫ్యాషన్ కంపెనీని అంకితి బోస్ , చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ధ్రువ్ కపూర్ 2015లో స్థాపించారు.
కంపెనీ ఖాతాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపిస్తూ అంకితి బోస్ ను తొలగించారు.
Also Read : హిజాబ్ పేరుతో హక్కుల ఉల్లంఘన