Annamalai BJP : డీఎంకే నిర్వహణ లోపం వల్లే ప్రజలపై రుణ భారం పెరిగింది
Annamalai : తమిళనాడు ప్రభుత్వం రుణంగా పొందిన రూ.10 లక్షల కోట్లు తిరిగి చెల్లించేందుకు మరికొన్నేళ్లు పడుతోందని, డీఎంకే ప్రభుత్వం కనీస అవసరాలకు ఈ రుణాన్ని వెచ్చించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యానించారు. అన్నామలై మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వ నిర్వాహణ లోపంవల్ల రాష్ట్ర ప్రజలపై రుణ భారం పెరుగుతూ వస్తోందని ఆరోపించారు.
BJP Leader Annamalai Slams
రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రభుత్వం రూ.60వేలకోట్ల నుంచి రూ.70వేలకోట్ల వరకు ఏ పథకాల కోసం ఖర్చు పెడుతోందో స్పష్టతలేదన్నారు. ఆరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీఎంకే విద్యా, ఉద్యోగ రంగంలో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులను ఉన్నతస్థాయికి ఏ విధంగా తీసుకువెళ్లిందో ఆదిద్రావిడ సంక్షేమ శాఖామంత్రి మదివేందన్ సమాధానం చెప్పాలని అన్నామలై డిమాండ్ చేశారు.
Also Read : Minister Bandi Sanjay : రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రం అన్ని విధాలా సహాయం..