Vallabhaneni Vamsi : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో పీటీ వారెంట్

Vallabhaneni Vamsi : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గన్నవరం పోలీసులు మరో షాక్ ఇచ్చారు. గన్నవరం, ఆత్కూర్ పోలీస్ స్టేషన్లలో నమోదైన రెండు కేసుల్లో పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ మేరకు గన్నవరం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు గన్నవరం పోలీసులు తనపై నమోదు చేసిన కేసులపై ఏపీ హైకోర్టును వంశీ ఆశ్రయించారు.

Vallabhaneni Vamsi Case

బీఎన్ఎన్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునేలా పోలీసులకు ఆదేశాలివ్వాలంటూ హైకోర్టులో రెండు పిటిషన్లు వేశారు. కాగా, ఇవాళ(గురువారం) ఈ పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. రెండు కేసుల్లోనూ ఏడేళ్ల లోపు శిక్షకు వీలున్న సెక్షన్లు మాత్రమే ఉన్నాయని వంశీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అందుకే నోటీసులు ఇచ్చి వివరణ మాత్రమే తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే ఈ కేసుల్లో పోలీసులు అదనంగా మరికొన్ని సెక్షన్లు చేర్చారని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. ఈ మేరకు ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కాగా, ప్రస్తుతం బెదిరింపులు, కిడ్నాప్ కేసులో విజయవాడ జిల్లా జైలులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Also Read : Kadambari Jatwani Case: ముంబై నటి జత్వానీ కేసుకు సంబంధించిన ముగ్గురు ఐపీఎస్‌ ల సస్పెన్షన్‌ పొడిగింపు

Leave A Reply

Your Email Id will not be published!