Sri Lanka : శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన అనురా కుమార..
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన అనురా కుమార...
Sri Lanka : అవినీతి రహిత సమాజం, మార్పు నినాదంతో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనురా కుమార దిసనాయకే(Anura Kumara Dissanayake) శ్రీలంక నూతన అధ్యక్షుడిగా సోమవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. దేశ తొమ్మదవ అధ్యక్షుడిగా దిసనాయకేతో కొలంబోలోని ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ప్రమాణం చేయించారు. నేషనల్ పీపుల్స్ పవర్ కూటమి నేతగా 55 ఏళ్ల దిసనాయకే శనివారంనాడు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రణిల్ విక్రమసింఘే, విపక్ష నేత సజిత్ ప్రేమదాస, మరో 35 మంది అభ్యర్థులతో తలబడి గెలుపు సాధించారు. 2022లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకునేందుకు శ్రీలంక ప్రపంచ దేశాల సాయం కోరుతున్న పరిస్థితుల్లో దేశాధ్యక్ష ఎన్నికలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Sri Lanka Chief…
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అనంతరం దిసనాయకే క్లుప్లంగా ప్రసంగిస్తూ, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను కలికసట్టుగా ఎదుర్కొనేందుకు పని చేస్తామని వాగ్దానం చేసారు. దేశ సవాళ్లపై తమకు పూర్తి అవగాహన ఉందని, కేవలం ప్రభుత్వం వల్ల కానీ, ఒకే పార్టీతోనే, ఒకే వ్యక్తితోనో ఈ తీవ్ర సంక్షోభం పరిష్కారం కాదని తాను నమ్ముతానని చెప్పారు. రాజకీయాలు ప్రక్షాళన కావాల్సిన అవసరం ఉందని, వైవిధ్య రాజకీయ సంస్కృతికి ప్రజలు పిలుపునిచ్చారని చెప్పారు. అలాంటి మార్పు తెచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన దిసనాయకేకు ప్రపంచ దేశాలు అభినందనలు తెలిపాయి. శ్రీలంకకు అతిపెద్ద క్రెడిటర్‌గా ఉన్న చైనాతో పాటు పొరుగుదేశాలైన ఇండియా, పాకిస్థాన్, మాల్దీవులు అభినందనలు తెలిపాయి.
Also Read : Bhumana Karunakar : శ్రీవారి ఆలయం ముందు హారతితో ప్రమాణం చేసిన మాజీ చైర్మన్