Anurag Thakur Anounces : భారత జట్టుకు కోటి నజరానా
ప్రకటించిన మంత్రి ఠాకూర్
Anurag Thakur Anounces : 73 ఏళ్ల సుదీర్ఘ అనంతరం భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. థామస్ కప్ విజేతగా భారత్ నిలిచింది. థాయ్ లాండ్ వేదికగా అనేక సార్లు ఛాంపియన్ గా నిలిచిన ఇండోనేషియాతో ఫైనల్ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేపట్టి ఘన విజయాన్ని నమోదు చేసింది.
3-0 తేడాతో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించి థామస్ కప్ గెలుచుకుంది. భారతీయులంతా గర్వపడేలా చేసింది భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు. తొలిసారిగా బంగారు పతకాన్ని ముద్దాడింది.
సింగిల్స్ లో లక్ష్యసేన్ ఆంథోనీ జింటింగ్ ను 21-8, 21-17, 21-16 తేడాతో షాక్ ఇచ్చాడు. మ్యాచ్ డబుల్స్ లో సాత్విక జయరాజ్ – చిరాగ్ శెట్టి జోడి 18-21, 23-21, 21-19 తేడాతో ఎహసాన్ – కేవిన్ సంజయ సుకముల్దియోపై గ్రాండ్ విక్టరీ సాధించారు.
మూడో మ్యాచ్ లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ 21-15, 23-21 వరుస సెట్లలతో జోనాతన్ క్రిస్టీని ఓడించి చరిత్ర సృష్టించాడు. దీంతో 3-0తో చిత్తుగా ఓడి పోయింది ఇండోనేషియా.
ఈ సందర్భంగా 73 ఏళ్ల అనంతరం అద్భుత విజయాన్ని నమోదు చేసిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టును అభినందనలతో ముంచెత్తారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మీ విజయం దేశానికి గర్వ కారణమని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా భారత దేశ క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur Anounces)భారత ప్రభుత్వం తరుపున థామస్ అందుకున్న భారత జట్టుకు కోటి రూపాయల నగదు నజరానా ప్రకటించారు.
ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. భారత జట్టును అభినందించారు ఏపీ సీఎం జగన్ రెడ్డి.
Also Read : గుజరాత్ టైటాన్స్ అలవోక విజయం