AP 10th Exams : నేటి నుంచే ఏపీలో 10వ తరగతి పరీక్షలు షురూ..

రెగ్యులర్ విద్యార్థుల్లో బాలురు 3,17,939 మంది, బాలికలు 3,05,153 మంది ఉన్నారు

AP 10th Exams : ఏపీ (ఆంధ్రప్రదేశ్)లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయి. నేటి నుంచి ఈ నెల 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. 10వ తరగతి పరీక్షలకు మొత్తం 7,25,620 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో 6,23,092 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 102,528 మంది రీ అడ్మిషన్ పొందిన విద్యార్థులు.

AP 10th Exams Started….

రెగ్యులర్ విద్యార్థుల్లో బాలురు 3,17,939 మంది, బాలికలు 3,05,153 మంది ఉన్నారు. రాష్ట్రంలో 3,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాఠశాల విద్యా శాఖ ప్రకారం, విద్యార్థులు తమ హాల్ టికెట్ ని బస్సులో చూపించడం ద్వారా పరీక్షా కేంద్రాలకు ఉచితంగా వెళ్లవచ్చని విద్యాశాఖ తెలిపింది.

Also Read : CAA: గుజరాత్ లో సీఏఏ అమలు ! 18 మంది పాక్‌ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం !

Leave A Reply

Your Email Id will not be published!