AP Budget 2025 : 3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ రూపకల్పన
ఆ బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది...
AP Budget 2025 : ఏపీ 2025-26 వార్షిక బడ్జెట్‌కు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ పత్రాలను అందజేశారు. ఆ తర్వాత ఆ బడ్జెట్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
AP Budget 2025 Updates
మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ను రూపొందించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav) తెలిపారు. ఇందులో వ్యవసాయానికి రూ.48,340 కోట్లు, వయబులిటీ గ్యాఫ్ ఫండ్ రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అలాగే ఎస్సీల గృహ నిర్మాణానికి రూ.50 వేలు, ఎస్టీల గృహ నిర్మాణానికి రూ.70 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు ఎన్టీఆర్ వైద్య భరోసాకు రూ.31,613 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు.
పాఠశాల విద్యకు రూ.31,806 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అలాగే బీసీ సంక్షేమానికి రూ.23,260 కోట్లు, వైద్యారోగ్య శాఖకు రూ.19,260 కోట్లు, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.18,848 కోట్లు, జలవనరుల అభివృద్ధికి రూ.18,020 కోట్లు, మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధికి రూ.13,862 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.13,600 కోట్లు, వ్యవసాయానికి రూ.11,636 కోట్లు, సాంఘిక సంక్షేమానికి రూ.10,909 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రూ.10,619 కోట్లు, రవాణా శాఖకు రూ.8,785 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు పేర్కొన్నారు.
రాజధాని ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడిందన్నారు. అన్ని రంగాలు మళ్లీ బలం పుంజుకుంటున్నాయని చెప్పారు. సేవల రంగంలో 11.7 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. పెన్షన్లను రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, దీపం పథకం ద్వారా అర్హులకు 3 ఉచిత సిలిండర్లు, 204 అన్న క్యాంటీన్లను ప్రారంభించినట్లు మంత్రి వివరించారు.
Also Read : Sudan Plane Crash :నివాస ప్రాంతాలపై కుప్పకూలిన ఎయిర్ క్రాఫ్ట్..46 మంది దుర్మరణం