AP Cabinet : నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్

క్యాబినెట్ సమావేశ ఆమోదాలు

AP Cabinet : అమరావతి సచివాలయంలో సీఎం జగన్‌(AP CM YS Jagan) అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాన చర్చ ఓటాన్ అకౌంటింగ్ బడ్జెట్ పై జరిగింది. డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్ల గురించి వివరించారు. దాదాపు 6000 టీచింగ్‌ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు. అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫారెస్ట్ రేంజర్‌తో సహా వివిధ స్థానాలు అందుబాటులో ఉన్నాయి.

AP Cabinet Updates

డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌, 6100 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5 వేల కోట్ల మేర నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్. అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదించింది. ఫిబ్రవరిలో అమలు చేసే పలు సంక్షేమ పథకాలకు ఆమోదం. YSR చేయూత నిధుల విడుదలకు ఆమోదం తెలిపిన కేబినెట్. మేనిఫెస్టోలో హామీ మేరకు వరుసగా నాలుగో విడత YSR చేయూత అమలు. ప్రతి గ్రామ పంచాయతీకి తప్పనిసరిగా పంచాయితీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం. 500 లోపు జనాభా ఉన్న పంచాయతీలకూ సెక్రటరీల నియామకం.

యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు. ఇంధన రంగంలో రూ.22 వేల కోట్లకుపైగా పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం ఆమోదం. ఎక్రోన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.1350 కోట్లు పెట్టుబడి ప్రతిపాదనను మంత్రివర్గం. 3350 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ కు ఆమోదం. న్యాయవాదుల సంక్షేమ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం. ఏపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లెజిస్లేచర్‌ స్టడీస్‌ అండ్‌ ట్రైనింగ్‌ సంస్థ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.

అసైన్డ్‌ భూముల మార్పిడి నిషేధ చట్ట సవరణ బిల్లుకు అంగీకారం. డిజిటల్ ఇన్‌ఫ్రా కంపెనీని రద్దు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం. సీఎం కుటుంబ భద్రతకు ఏర్పాటు చేసే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్‌లో 25 మంది హెడ్‌ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అంగీకారం. పాఠశాల విద్యాశాఖలో ఇతర ఖాళీలను పదోన్నతి, బదిలీల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయం. డిస్కంలకు రూ.1500 కోట్ల రుణం తీసుకునేందుకు బ్యాంకు హామీకి మంత్రివర్గం ఆమోదం.

Also Read : Chandrababu Pawan Kalyan : టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటనపై రగడ

Leave A Reply

Your Email Id will not be published!