AP Cabinet Meeting : మరికొంచెం ముందు కు వెళ్లనున్న ఏపీ క్యాబినెట్ మీటింగ్

ఈ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8వ తేదీన వెలువడ్డాయి...

AP Cabinet Meeting : చంద్రబాబు సారథ్యంలో సమావేశం కానున్న కేబినెట్ భేటీ వాయిదా పడే అవకాశముందని తెలుస్తోంది. గురువారం అంటే.. పిబ్రవరి 20వ తేదీ ఉదయం 11.00 గంటలకు అమరావతిలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది. అయితే అదే రోజు.. న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులతోపాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఆ క్రమంలో ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu) సైతం హాజరయ్యే అవకాశముందని సమాచారం. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం వాయిదా పడే అవకాశముందని ఓ చర్చ నడుస్తోంది. అయితే ఈ అంశంపై ఇంకా అధికారిక ప్రకటన ప్రభుత్వం నుంచి వెలువడ లేదు.

AP Cabinet Meeting Postpined

70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5 వ తేదీన ఒకే విడతలో జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8వ తేదీన వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో దేశ రాజధాని ఢిల్లీ ఓటరు.. బీజేపీకి పట్టం కట్టారు. దీంతో ఆ పార్టీకి 48 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేవలం 22 స్థానాలకు పరిమితమైంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం వరుసగా మూడోసారి సైతం ఖాతా తెరువలేదు. వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ పాలనకు ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టనుండడం ద్వారా చరమ గీతం పాడినడ్లు అయింది.

మరో వైపు..బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పర్వేష్ వర్మను ఎంపిక చేయనున్నారనే ఓ ప్రచారం సైతం వాడి వేడిగా సాగుతోంది. ఎందుకంటే. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్‌పై బీజేపీ అభ్యర్థిగా ఆయన గెలుపొందారు. అదీకాక..ఢిల్లీ మాజీ సీఎం సాహెచ్ సింగ్ వర్మ కుమారుడు కూడా కావడం.. ఆయనకు కలిసి వచ్చే అంశమని ఓ ప్రచారం సాగుతోంది. దాదాపు మూడు దశాబ్దాల అనంతరం ఢిల్లీలో బీజేపీ పాలన పగ్గాలు అందుకోవడంతో.. ఆ పార్టీ శ్రేణుల్లో ఊపు ఉత్సాహం కొత్త పుంతలు తొక్కుతోంది. అలాంటి వేళ పార్టీలోని అతిరథుల సమక్షంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగాలని పార్టీ అగ్రనేతలు భావించారు. అందులోభాగంగా ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని బీజేపీలోని అగ్రనాయకత్వం నిర్ణయించింది. దీంతో ఫిబ్రవరి 20వ తేదీన సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు.

Also Read : Rahul Gandhi Slams : రాత్రికి రాత్రే సీఈసీ ఎంపిక చేయడం సరికాదంటున్న రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!