AP CID Chandra Babu : చంద్రబాబు సహకరించడం లేదు
ఆంధ్రప్రదేశ్ సీఐడీ స్పెషల్ పీపీ
AP CID Chandra Babu : రాజమండ్రి – ఏపీ స్కిల్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు ఏపీ సీఐడీకి రెండు రోజుల విచారణ చేపట్టి పూర్తి చేసింది ఏపీ సీఐడీ. పూర్తి భద్రత మధ్య సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు.
AP CID Chandra Babu Issue
తొలి రోజు ఏపీ స్కిల్ స్కాం కేసులో రూ. 371 కోట్లు చేతులు మారాయాని, అవి షెల్ కంపెనీల ద్వారా హవాలా రూపంలో తరలించారని ఆరోపించింది ఏపీ సీఐడీ. దీనికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడును(Chandrababu) తొలి రోజు 7 గంటలు పాటు విచారించింది. రెండో రోజు 14 గంటలకు పైగా విచారణ పూర్తి చేసింది.
ఈ సందర్బంగా ఏపీ సీఐడీ స్పెషల్ పీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ స్కిల్ స్కాం కేసులో విచారణకు చంద్రబాబు నాయుడు సహకరించడం లేదని ఆరోపించారు. ఇదంతా కావాలని ఆయన చేస్తున్నారంటూ పేర్కొన్నారు. దీంతో మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో కోరామని తెలిపారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఏసీబీ కోర్టులో సీఐడీ తమకు 5 రోజుల కష్టడీ కావాలని కోరింది. కానీ కోర్టు ఒప్పుకోలేదు. కేవలం 2 రోజులు మాత్రమే ఇచ్చింది. మొత్తంగా ఏపీ సీఐడీ పీపీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Also Read : IND vs AUS 2nd ODI : భారత్ దెబ్బకు ఆసిస్ విలవిల