AP CM YS Jagan : విద్యా కుసుమాలు ఆణిముత్యాలు – జగన్
ప్రతిభామూర్తులకు ప్రభుత్వం అండదండలు
AP CM YS Jagan : చదువు కోవడం వల్ల సంస్కారమే కాదు ఉన్నత స్థాయిలో ఎదిగేందుకు దోహదం చేస్తుందని అన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం రాష్ట్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇటీవల జరిగిన వివిధ పరీక్షలలో అత్యున్నత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రభుత్వం అవార్డులను అందజేసింది. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమానికి ఏపీ సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా విద్యా రంగానికి ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పారు సీఎం(YS Jagan). అత్యధికంగా బడ్జెట్ లో నిధులను కేటాయించామని చెప్పారు. గత నాలుగు సంవత్సరాలలో విద్యా దీవెన కింద భారతీ ఎత్తున ఖర్చు చేశామని స్పష్టం చేశారు. తాము ప్రవేశ పెట్టిన నాడు నేడు కార్యక్రమానికి విపరీతమైన స్పందన లభిస్తోందన్నారు. తాము తీసుకు వచ్చిన ఈ మోడల్ ను చూసి దేశం అనుసరిస్తోందని ఇంతకంటే ఇంకేం కావాలన్నారు.
ఇవాళ ప్రభుత్వ బడులలో మౌలిక వసతులను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఏ ఒక్కరికీ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు స్టూడెంట్స్ కోసం కిట్ లను ఇస్తు్న్నామన్నారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి. ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించడం, వారిని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని స్పష్టం చేశారు.
Also Read : Arvind Kejriwal : ఎల్జీ నిర్వాకం సీఎం ఆగ్రహం