AP CM YS Jagan : సమ్మె విరమించుకున్న మున్సిపల్ కార్మికులు..శుభవార్త చెప్పిన జగనన్న
హామీలు నెరవేర్చకపోతే మల్లి మొదలెడతామన్న కార్మికులు
AP CM YS Jagan : జగన్ సర్కార్ మున్సిపల్ కార్మికులకు శుభవార్త తెలియజేసింది. నగరపాలక సంస్థ ఉద్యోగులందరికీ సంక్రాంతికి కొత్త బట్టలు కొనేందుకు రూ.1000 ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను తాత్కాలికంగా నిలిపివేసినట్లు యూనియన్ నాయకులు బుధవారం రాత్రి ప్రకటించారు. గురువారం యథావిధిగా వారి విధులు నిర్వహించారు. అయితే హామీని నెరవేర్చకుంటే మళ్లీ సమ్మె చేస్తామని యూనియన్ నాయకులు ప్రకటించారు.
AP CM YS Jagan Comment
బుధవారం విజయవాడ సచివాలయంలో మున్సిపల్ యూనియన్ నేతలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి మధ్య జరిగిన చర్చలు సఫలీకృతమయ్యాయి. పట్టణ కార్మికులు మరియు పురపాలక సంఘాలలో పనిచేసె ప్రతీ కార్మికునికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు బొత్స. మున్సిపల్ ఉద్యోగి జీతం రూ.21,000. భవిష్యత్తులో జీతం పెంపుదల జరిగితే, మీ మూల వేతనాన్ని 21,000 రూపాయలు గా పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సమ్మె కాలంలో కూడా తమ జీతాన్ని చెల్లిస్తామని, వారిపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని బొత్స ప్రకటించారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదవశాత్తు మరణించిన వారికీ సహాయం 500,000 నుండి 700,000కి పెంచామన్నారు. 2019 నుండి దరఖాస్తు చేసుకోని మృతుల కుటుంబ సభ్యులు ఇప్పుడు దరఖాస్తు చేసినప్పటికీ గుడ్‌విల్ అలవెన్స్‌ను అందిస్తామన్నారు.
Also Read : Ex MP Harsha Kumar : షర్మిల పదవీ బాధ్యతలపై మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు