AP CM YS Jagan : భారత మహిళా క్రికెట్ జట్టుకు జగన్ కితాబు
ఏడోసారి ఆసియా కప్ టీమిండియా కైవసం
AP CM YS Jagan : పంజాబ్ కు చెందిన హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వరుసగా ఏడోసారి ప్రతిష్టాత్మకమైన మెగా టోర్నీ ఆసియా కప్ ను కైవసం చేసుకుంది. ప్రత్యర్థి శ్రీలంక జట్టును చిత్తు చేసింది. తనకు ఎదురే లేదని చాటింది.
ప్రధానంగా స్టార్ హిట్టర్ గా పేరొందిన భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కళ్లు చెదిరే షాట్స్ తో అలరించింది. అంతకు ముందు తక్కువ స్కోర్ కే కట్టడి చేయడంలో టీమిండియా కీలక పాత్ర పోషించింది. ఇదిలా ఉండగా శ్రీలంకపై ఘన విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టుకు ప్రత్యేకంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తో పాటు భారత జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కంగ్రాట్స్ తెలిపారు. తాజాగా ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan) అమ్మాయిల ఆట తీరుపై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు.
భారత జట్టు ఆడిన తీరు అద్భుతమని పేర్కొన్నారు. టీమిండియా జట్టులో మహిళా క్రికెటర్లు ఎక్కడా తడబాటుకు లోనుకాకుండా ధైర్యంగా ఆడారని కొనియాడారు. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో అసమాన ఆట తీరు ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
నిజమైన ఛాంపియన్లుగా నిలిచారని ప్రశంసలతో ముంచెత్తారు ఏపీ సీఎం సందిటి జగన్ మోహన్ రెడ్డి. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి భారత దేశానికి మంచి పేరు తీసుకు వస్తారన్న ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.
Also Read : ఆసియా కప్ టీమిండియాదే