AP CM YS Jagan : మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్
మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన అనంతరం వాళ్ళ ఇంట్లోనే భోజనం చేయనున్న సీఎం జగన్
AP CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాసేపటి క్రితం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్‌లోని కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు.
AP CM YS Jagan Met KCR
గత నెల 7వ తేదీన ఫామ్‌హౌస్‌లో జారిపడి, తుంటి ఎముకకు గాయమైన కేసీఆర్ ను జగన్ పరామర్శించారు. జగన్ భేటీ అనంతరం ఇద్దరు నేతలూ కలిసి భోజనం చేయనున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఇరువురు నేతలూ తమ రాజకీయ పోకడలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 8వ తేదీన కేసీఆర్ కు తుంటికి శస్త్ర చికిత్స జరిగిన విషయం అందరికీ తెలిసిందే.
ఎనిమిది రోజులపాటు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని బీఆర్ఎస్(BRS) అధికారులు తెలిపారు.
Also Read : MP Nandigam Suresh : ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా 2024లో జగన్ విజయం కాయం