AP CM YS Jagan : వైఎస్సార్ జనం మెచ్చిన దేవుడు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
AP CM YS Jagan : శ్రీకాకుళం – భౌతికంగా మన మధ్య లేక పోయినా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని నేటికీ స్మరించు కుంటున్నారని గుర్తు చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. శ్రీకాకుళం జిల్లా పలాసలో వైఎస్సార్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం పలాసలో వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు.
AP CM YS Jagan Comment about YSR
అనంతరం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను పరిశీలించారు జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan). ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రికి కోట్లాది మంది ప్రజలు అభిమానులుగా ఉన్నారని, సీఎంగా ఉన్న హయాంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు.
ఇవాళ తాను కూడా తన తండ్రి వైఎస్సార్ అడుగు జాడల్లో నడుస్తున్నానని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే విద్య, వైద్యం రంగాలకు ప్రయారిటీ ఇచ్చినట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఇవాళ తాము ప్రవేశ పెట్టిన నాడు నేడు పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఇవాళ కేంద్ర సర్కార్ సైతం తమ పథకాన్ని అమలు చేయాలని అనుకుంటోందన్నారు. పేదలకు మెరుగైన రీతిలో వసతి సౌకర్యాలను కల్పించడమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు.
Also Read : Revanth Reddy CM : శాసన సభ ఆదర్శ ప్రాయం కావాలి