AP Employees : జీఓ నెం11 అమలుకు గ్రామా వార్డు సచివాలయాల ఉద్యోగుల డిమాండ్
ఈ సందర్భంగా జానీవాషా మాట్లాడుతూ..
AP Employees : పంచాయత్ రాజ్ జారీ చేసిన జీవో 11ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పంచాయితీ రాజ్ జారీ చేసిన జీవో 11ని వెంటనే అమలు చేయాలని గ్రామ, వార్డు సచివాలయాల అధికారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జానీబాషా కోరారు. ఆదివారం విజయవాడలోని ఏపీ(AP) ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల పంచాయతీ కార్యదర్శుల ప్రతినిధులు హాజరయ్యారు.
AP Employees Issue
ఈ సందర్భంగా జానీవాషా మాట్లాడుతూ.. ప్రభుత్వరంగంలోని అవినీతిపై పోరులో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సంపూర్ణంగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏపీఎన్జీఓఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ గ్రామ, వార్డు కార్యాలయ సిబ్బందికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. తమ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేందుకు సాధ్యమైన ప్రతిదాన్ని కొనసాగిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీ రాజ్ ద్వారా ప్రకటించిన జీవో నంబర్ 11 ద్వారా గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శి అధికారాలను వేగంగా అమలు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
Also Read : Kesineni Nani: చంద్రబాబుకు కేశినేని నాని సవాల్ !