AP Government: యూరియాపై ఏపీ ప్రభుత్వం అలర్ట్

యూరియాపై ఏపీ ప్రభుత్వం అలర్ట్

AP Government : యూరియా కొరత రానివ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) చర్యలు చేపట్టింది. గత ఖరీఫ్ కంటే ఎక్కువగా ఎరువుల సరఫరా చేసేలా చర్యలు తీసుకుంది. 2025 ఖరీఫ్‌లో అదనంగా అందుబాటులో 83 వేల టన్నుల యూరియా ఉంది. విజిలెన్స్ అధికారులు నిఘా ఉంచి జిల్లాల వారీగా మానిటరింగ్ చేస్తున్నారు. యూరియా కొరతపై రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ భరోసా ఇచ్చింది. ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ఏపీ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.

AP Government Key Comments on Urea Sortage

మరోవైపు.. కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. కడప జిల్లాలో రైతులకు యూరియా కొరత ఎక్కడ లేదని క్లారిటీ ఇచ్చారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. జిల్లాలో వర్షాలు ముందుగా రావడంతో వరి నాట్లు త్వరగా వేస్తున్నారని చెప్పుకొచ్చారు. జిల్లాలో ఎరువుల సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్. ఎక్కడైనా ఎరువులు అయిపోతే వేరే కేంద్రాల నుంచి 24గంటల్లో అందజేస్తామని పేర్కొన్నారు. 3700 యూరియా జిల్లాలో అందుబాటులో ఉందని తెలిపారు. రైతులు తమకు సరిపడా ఎరువులు మాత్రమే తీసుకోవలసిందిగా సూచించారు.

జిల్లాలో యూరియాను స్టాక్ పెట్టిన ఇతర అవసరాలకు వాడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మందలించారు. కొన్ని ప్రైవేట్ షాపుల్లో వేరే ఎరువులు తీసుకుంటేనే యూరియా ఇస్తామని చెబుతున్నారని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం నుంచి జిల్లాలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారని వెల్లడించారు. యూరియాను ఎమ్మార్పీ కంటే అధిక ధరలో విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. కడప జిల్లాలో ఎరువుల షాప్ వద్ద ప్రభుత్వ (AP Government) సిబ్బందిని నియమిస్తామని కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు.

విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ హరిశ్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు, రైతులకు అత్యంత కీలకమైన యూరియా ఎరువును దాచిపెట్టడం (హోర్డింగ్) మరియు బ్లాక్ మార్కెటింగ్ నివారించేందుకు ప్రత్యేక దాడులు నిర్వహించబడుతున్నాయి. వ్యవసాయోత్పత్తి పెంపుదలలో యూరియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. యూరియాను దారి మళ్లించడం, అక్రమంగా నిల్వ చేయడం లేదా బ్లాక్ మార్కెటింగ్ చేయడం చట్టవిరుద్ధమే కాకుండా రైతులకు ఇబ్బందులు కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా గోదాములు, హోల్‌సేల్ డీలర్లు మరియు రిటైల్ షాపులపై విజిలెన్స్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ (AP Government) నియమాల ప్రకారం నిల్వలు, పంపిణీ జరుగుతున్నాయా లేదా అన్నదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఈ రకమైన అక్రమ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. యూరియా అక్రమ నిల్వ లేదా దారి మళ్లింపు సంబంధిత సమాచారం ఉన్నవారు సమీప విజిలెన్స్ కార్యాలయానికి తెలియజేయాలని ప్రజలు మరియు రైతులను విజిలెన్స్ శాఖ కోరుతోంది. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి, ఎరువుల సమయానుకూల లభ్యతకు అందరి సహకారం అవసరం.

Also Read : AP Liquor Scam: మాజీమంత్రి నారాయణస్వామిని ప్రశ్నించిన సిట్‌ అధికారులు

Leave A Reply

Your Email Id will not be published!