AP Govt : ఏపీ సర్కార్ వైఎస్ఆర్ జిల్లా పేరు మారుస్తూ సంచలన నిర్ణయం
వైఎస్సార్ జిల్లాకు కడప పేరును కలపాలని గతంలోనే రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది...
AP Govt : వైఎస్సార్ జిల్లా పేరును మారుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ కడప జిల్లా పేరును కడప జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం జీఓలో పేర్కొంది. వైఎస్సార్ జిల్లాకు కడప పేరును కలపాలని గతంలోనే రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.
AP Govt Shocking Decision
కాగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా విస్తరణ చేసిన క్రమంలో కడప జిల్లాకు వైఎస్సార్ కడప జిల్లాగా పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మీద ఆయన ఆయన సొంత జిల్లాకు పేరు పెట్టారు. కానీ, ఇప్పుడు ఆ పేరును తొలగిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Also Read : NIA Arrest : పాక్ తో గూఢచర్యం కేసులో సిఆర్పిఎఫ్ జవాన్ అరెస్ట్