AP Govt Announces : కృష్ణంరాజు జ్ఞాపకార్థం స్మృతి వనం
ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
AP Govt Announces : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన(AP Govt Announces) చేసింది. సినీ, రాజకీయ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత కలిగి ఉన్న నటుడు కృష్ణంరాజు ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం రాష్ట్ర సర్కార్ స్మృతి వనం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
నటుడిగా, మాజీ మంత్రిగా కృష్ణంరాజు ఎనలేని సేవలు అందించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు గౌరవార్థం ఆయన పుట్టిన ఊరు మొగల్తూరు తీర ప్రాంతంలో స్మారక పార్కును ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
ప్రముఖ నటి, ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ లో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే రోజా, సినిమాటోగ్రఫీ , ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి సీహెచ్ వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద రాజు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు చేరుకున్నారు.
కృష్ణంరాజు స్మారక సభను పురస్కరించుకుని ప్రముఖ నటుడు ప్రభాస్ తో పాటు ఆయన మామ కృష్ణంరాజు కుటుంబంతో ముచ్చటించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం స్మృతి వనం కోసం స్థలాన్ని కేటాయించినందుకు నటుడు ప్రభాస్, కృష్ణంరాజు భార్య ధన్యవాదాలు తెలిపారు సీఎం జగన్ రెడ్డికి.
కృష్ణంరాజు స్వంత నివాసంలో సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం తరపున మంత్రులు హాజర్యారు. ప్రభాష్ కు, కృష్ణంరాజు కుటుంబీకులకు మంత్రులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
అనంతరం మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. కృష్ణంరాజును కోల్పోవడం బాధాకరం. ఆయన స్మృత్యర్థం ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు. ప్రజలందరూ, పార్టీలు అంతా ప్రేమించే , గౌరవించే వ్యక్తిత్వం ఆయనదని కొనియాడారు.
Also Read : వర్షాల దెబ్బకు ఏపీ..తెలంగాణ విలవిల